ద్రాక్షారామ టౌన్ ఆటో యూనియన్ అధ్యక్షునిగా బొమ్ము సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక


రామచంద్రపురం మండలం, BCN రిపోర్టర్ దొరబాబు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ టౌన్ ఆటో యూనియన్ సమైక్యంగా కలిసి పట్టణ అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ద్రాక్షారామ టౌన్ కోటిపల్లి రోడ్డు ఆటో యూనియన్ యానం రోడ్డు ఆటో యూనియన్ కాకినాడ రోడ్డు ఆటో యూనియన్ బోసుబొమ్మ సెంటర్ ఆటో యూనియన్ సమైక్యంగా కలిసి గౌరవ అధ్యక్షులు మాగాపు అమ్మిరాజు అధ్యక్షతన ద్రాక్షారామ టౌన్ అధ్యక్షునిగా బొమ్ము సత్యనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి ఈ ఆటో యూనియన్ కొనసాగుతూ ఉందని, సరైన ఉపాధి లేక ఉన్నత చదువులు అభ్యసించి కూడా జీవనోపాధి కోసం ఆటో కార్మికులుగా పనిచేస్తున్నామని తమకు ఎటువంటి సమస్య వచ్చినా సానుకూలంగా స్పందించి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని పట్టణ అధ్యక్షునిగా ఎన్నుకున్నామని అన్నారు.

ముఖ్యంగా ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ లో భాగమైన ఉచిత బస్సు ప్రయాణం ఆటో కార్మికుల ఉపాధికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని ఆటో కార్మికులందరికీ న్యాయం చేకూర్చే దిశగా తగిన నిర్ణయం తీసుకోవాలని కార్మికులు కోరారు. ఈ కార్యక్రమంలో నాలుగు ఆటో యూనియన్ సర్వ సభ్యులు పాల్గొన్నారు.