ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 261 మంది ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ తూర్పు మధ్య రైల్వే వెల్లడి

 
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ (జూన్ 3, మధ్యాహ్నం 01:45) 261 మంది ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ తూర్పు మధ్య రైల్వే (South Eastern Railway) వెల్లడించింది. అయితే.. ఇలాంటి రైలు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సాయపడే కవచ్ టెక్నాలజీ.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రూట్‌లో అందుబాటులో లేదని రైల్వే శాఖ వెల్లడించడం గమనార్హం. కవచ్ అందుబాటులో ఉండి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదనే వాదనలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ‘కవచ్’‌ ట్విటర్ ట్రెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో.. ఈ కవచ్ అంటే ఏమిటి..? ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..

రైలు ప్రమాదం:

పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841) శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 15 కోచ్‌లు పట్టాలు తప్పగా.. వాటిలో ఏడు తిరగబడిపోయినట్టు సమాచారం. వాటిలో కొన్ని పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడ్డాయి. కొద్దిసేపటికి.. ఆ రెండో ట్రాక్‌ మీదుగా హౌరాకు వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నంబర్‌ 12864) ట్రాక్‌పై పడి ఉన్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌లను ఢీకొంది. ఆ తాకిడికి బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగైదు బోగీలు పట్టాలు తప్పినట్టు సమాచారం. తిరగబడిపోయిన బోగీల కింద వందలమంది చిక్కుకుపోయారు.

ఈ ప్రమాదంలో 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రేయింబవళ్లూ సహాయక చర్యలు కొనసాగించాయి. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరగబడ్డ కోచ్‌ల కింద చిక్కుకుపోయి.. ఇరుక్కుపోయి.. కాళ్లు, చేతులు తెగి.. కాపాడాలంటూ హృదయవిదారకంగా వారు చేస్తున్న ఆర్తనాదాలు.. చెల్లాచెదురుగా పడిన బోగీలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.

Kavach: ట్రెండింగ్‌లో కవచ్.. ఇంత ఘోర ప్రమాదం జరిగాక కవచ్ గురించి రైల్వే శాఖ బయటపెట్టిన షాకింగ్ నిజం..!

రైళ్లు ఎదురెదురుగా వచ్చేప్పుడే కాకుండా.. పట్టాల్లో లోపాలున్నా కవచ్‌ ఆ మార్గంలో వచ్చే రైలును నిలిపివేస్తుంది. ఒకే ట్రాక్‌పై ఒకే దిశలో రెండు రైళ్లు వెళ్తున్నా.. వెనక వచ్చే ట్రైన్‌ దూరాన్ని తగ్గించి, ప్రమాదం జరగకుండా చూస్తుంది. అదే సమయంలో లోకోపైలట్‌ను అప్రమత్తం చేస్తుంది. సిగ్నలింగ్‌ వ్యవస్థకూ కవచ్‌తో అనుసంధానం ఉంటుందని, పొగమంచు కారణంగా రెడ్‌ సిగ్నల్‌ కనిపించక.. లోకోపైలట్‌ ముందుకు వెళ్తుంటే హెచ్చరిస్తుంది. 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లపై కవచ్‌ ప్రయోగం విజయవంతమైంది.

కవచ్ అంటే ఏమిటి..? రైలు ప్రమాదాలను ఎలా అవుతుంది. దిని గురించి...


రైలు ప్రమాదాలు: కారణాలు & కవాచ్

"కవాచ్" అనేది ఆంగ్లంలో "షీల్డ్" అని అనువదించే హిందీ పదం. ఇది రక్షణ కవచం లేదా అడ్డంకిని సూచించడానికి భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే పదం.

మానవ తప్పిదాలు, సాంకేతిక వైఫల్యాలు, మౌలిక సదుపాయాల సమస్యలు లేదా బాహ్య కారకాలతో సహా వివిధ కారణాల వల్ల రైలు ప్రమాదాలు సంభవించవచ్చు. రైలు ప్రమాదాలకు కొన్ని సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి:

మానవ తప్పిదం: మితిమీరిన వేగం, సిగ్నల్ ఉల్లంఘనలు లేదా అలసట వంటి రైలు ఆపరేటర్లు చేసే పొరపాట్లు ప్రమాదాలకు దారితీయవచ్చు.

ట్రాక్ లోపాలు: పట్టాలు, స్లీపర్‌లు లేదా స్విచ్‌లలో లోపాలతో సహా ట్రాక్‌ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల పట్టాలు తప్పడం లేదా ఢీకొనడం జరుగుతుంది.

పరికరాల వైఫల్యం: బ్రేక్‌లు, చక్రాలు లేదా కప్లింగ్‌లు వంటి రైలు భాగాలు పనిచేయకపోవడం ప్రమాదాలకు దారితీయవచ్చు.

ఢీకొనడం: సిగ్నల్‌లను పాటించడంలో వైఫల్యం, తప్పు సిగ్నలింగ్ వ్యవస్థలు లేదా సరికాని సమన్వయం కారణంగా లెవల్ క్రాసింగ్‌ల వద్ద రైళ్లు ఇతర రైళ్లు లేదా వాహనాలను ఢీకొనవచ్చు.

ప్రకృతి వైపరీత్యాలు: వరదలు, కొండచరియలు విరిగిపడటం లేదా భూకంపాలు వంటి సహజ సంఘటనలు ట్రాక్‌లను దెబ్బతీస్తాయి లేదా ప్రమాదాలకు కారణమవుతాయి.

విధ్వంసం: రైల్వే అవస్థాపనకు విధ్వంసం లేదా ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే చర్యలు ప్రమాదాలకు దారితీయవచ్చు.

మానవ కారకాలు: ప్రయాణీకుల ప్రవర్తన, రద్దీ, లేదా ట్రాక్‌లపై అనధికారికంగా అతిక్రమించడం ప్రమాదాలకు దోహదపడతాయి.

రైలు ప్రమాదాల యొక్క నిర్దిష్ట కారణాలు మరియు పరిస్థితులు మారవచ్చు మరియు ప్రతి సంఘటనలో ఉన్న ఖచ్చితమైన కారకాలను గుర్తించడానికి పరిశోధనలు సాధారణంగా నిర్వహించబడతాయని గమనించడం ముఖ్యం.

ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చే రైళ్లను 380 మీటర్ల దూరంలోనే నిలిపేస్తుంది.

వంతెనలు, మలుపులు(బాటిల్‌నెక్స్‌) ఉన్నచోట్ల రైళ్ల వేగంపై నియంత్రణ ఉండాలి. 30 కిమీ వేగాన్ని దాటకూడదు. కవచ్‌ వ్యవస్థ ఈ ప్రాంతాల్లో అతి వేగాన్ని నియంత్రించి, రైళ్ల స్పీడ్‌ను 30 కిమీకి తీసుకువస్తుంది.

పరిమితికి మించిన వేగాన్ని లోకోపైలట్‌ నియంత్రించలేకపోతే.. కవచ్‌ ఆ రైలులోని బ్రేకింగ్‌ వ్యవస్థపై ఆటోమేటిక్‌గా పనిచేసి, వేగాన్ని తగ్గిస్తుంది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటివరకు 1,098 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు కవచ్‌ పరిధిలోకి వచ్చాయి. 65 రైళ్లలోనూ దీన్ని అమలు చేస్తున్నారు. ఈ రైళ్లన్నీ గంటకు 160 కిమీ వేగంతో వెళ్తాయి.

కవచ్‌ వ్యవస్థలో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్‌ డివైజ్‌లను వినియోగిస్తారు. రైల్వే ట్రాక్‌లపై, రేల్వేస్టేషన్లలో, రైళ్లలో వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కార్ల విండ్‌షీల్డ్‌పై ఉండే రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్‌ఎఫ్‌ఐడీ) ఫాస్టాగ్‌ల కంటే.. కవచ్‌లో వినియోగించే ఫ్రీక్వెన్సీ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.

ఇన్ని ప్రత్యేకతలున్నా కవచ్ ఎందుకు ఫెయిలైంది..? రైల్వే శాఖ ఏమంటోంది..?

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వెళ్లే రూట్‌లో కవచ్ టెక్నాలజీ అందుబాటులో లేదని రైల్వే శాఖ అధికారి అమితాబ్ శర్మ పేర్కొనడం గమనార్హం. ఎందుకు లేదని తృణముల్ కాంగ్రెస్ నిలదీసింది. రైల్వే శాఖపై ఈ విషయంలో నెటిజన్ల నుంచి కూడా తీవ్ర విమర్శలు రావడం గమనార్హం.

01) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో గెలిచేది ఏవరు? 

మీ అభిప్రాయాన్ని ఓటు గుర్తు పై క్లిక్ చేసి ఆప్షన్స్ ఎంచుకోండి.. సీక్రెట్ ఓటింగ్ చేయండి.