ఘనంగా జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అన్న HV పూర్ణ పుట్టినరోజు వేడుకలు
ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలలో ముందుగా స్పందించి సమాజానికి, ప్రజలకు సేవలందించేవి స్వచ్చంధ సంస్థలేనని
నగరం మాజీ ఎమ్మెల్యే మనేపల్లి అయ్యాజీ వేమా అన్నారు. ప్రతి కుటుంబం ఘనంగా నిర్వహించుకునే పుట్టినరోజు వేడుకలను స్వచ్చంధ సేవకురాలు అయినవిల్లి మండలం మాజీ జడ్పీటీసీ గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని స్ధానిక విలస గ్రామంలో మన్నా మినిస్ట్రీస్ న్యూ లైఫ్ సెంటర్(కుష్ఠు మరియు ఎయిడ్స్ రోగుల పునరావాస కేంద్రం)లో వ్యాధి పీడితుల మధ్యలో జి యం సి బాలయోగి చారిటబుల్ సొసైటీ(1999) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ అక్కిశెట్టి దుర్గారావు అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ మేమా మాట్లాడుతూ కరోనా వంటి ఆపత్కాలంలో చేయూత విషయంలో ప్రభుత్వ వ్యవస్థల కంటే ముందుగా బాధితులకు అండగా మేమున్నామని నిలిచే స్వచ్చంధ సంస్థలు సమాజానికి ఆయువుపట్టు అని కొనియాడారు. నేటి యువత సేవలో సేవా కార్యక్రమాల్లో మన ప్రాంతంలో అన్నపూర్ణ శ్రీనివాస్ దంపతులను ఆదర్శంగా తీసుకుని మరింత చైతన్యంగా పాల్గొని స్ఫూర్తిగా నిలవాలని పేర్కొన్నారు. 26 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు సొంత ఖర్చులతో ఎవరి నుండి ఎటువంటి విరాళాలు సేకరించకుండా ఎన్నో రకాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో బాధితులకు అండగా నిలిచి ప్రజల మన్ననలు పొందుతున్న గంగుమళ్ళ దంపతులు అంబేద్కర్ కోనసీమ జిల్లాకే తలమానికిమని అన్నారు.
అనంతరం వ్యాధి పీడితులకు రోటే, పండ్లు, వస్త్రాలు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం జనసేన పార్టీ సమన్వయకర్త మద్ధా చంటిబాబు, బిజెపి ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు(బాబి మాస్టారు), దళిత నాయకులు గిడ్ల వెంకటేశ్వరరావు, విశ్రాంత మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు అన్నా మినిస్ట్రీస్ అధినేత ఐ.ఇ కుమార్, అయినవిల్లి ఉప సర్పంచ్ పోలిశెట్టి రాజేష్, సిరిపల్లి మాజీ సర్పంచ్ బొక్కా రామచంద్రరావు, పొట్టిలంక మాజీ సర్పంచ్ వడ్డి మణి శ్రీనివాస్, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు మద్దా సునీతా రాంబాబు, చిల్లా వెంకటేశ్వరరావు, కంఠంశెట్టి నారాయణరావు, గొట్టిముక్కల నాగరాజు, అబ్బిరెడ్డి రాందాసు ఫౌండేషన్ ట్రస్ట్ మరియు అబ్బిరెడ్డి చెడీ తాలింఖానా అధినేతలు అబ్బిరెడ్డి సురేష్, రమేష్ మూర్తి, యుగంధర్ నంద్యాల చంటి, గుండాబత్తుల తాతాజీ, గండి సత్తిబాబు, నామాడి నాగబాబు, సూర్య హాస్పిటల్ అధినేత విళ్ళ గణేష్, తోలేటి ఉమ, నల్లా సత్తిబాబు, అమరా సత్యనారాయణ, నల్లా నాగు, నల్లా బ్రదర్స్, కొప్పిశెట్టి బ్రదర్స్ మరియు గంగుమళ్ళ యువసేన అభిమానులు పాల్గొన్నారు.