అర్థమువుతుందా? జర జాగ్రత్త.. అవసరమైతేనే బయటకు రావాలట


మండే ఎండలు ఒకవైపు.. కీలకమైన ఎన్నికలు మరోవైపుతో వారు బయటకు రాలేక.. వచ్చినా భానుడి భగభగలతో కిందా మీదా పడుతున్నారు.అర్థమువుతుందా? జర జాగ్రత్త.. అవసరమైతేనే బయటకు రావాలట.


అంచనాలకు తగ్గట్లే ఈసారి వేసవి జనాలకు చుక్కలు చూపిస్తోంది. గడిచిన సంవత్సరాలతో పోలిస్తే ఈ సమ్మర్ హాట్ హాట్ గా ఉంటుందని.. వాతావరణ శాఖ నిపుణులు గడిచిన కొన్ని నెలల ముందు నుంచే హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శివరాత్రికి రెండు వారాల ముందు నుంచే వేసవి మొదలైన సంగతి తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నేతలు.. కార్యకర్తలు.. ఫాలోవర్లు కిందా మీదా పడుతున్నారు.
 
మండే ఎండలు ఒకవైపు.. కీలకమైన ఎన్నికలు మరోవైపుతో వారు బయటకు రాలేక.. వచ్చినా భానుడి భగభగలతో కిందా మీదా పడుతున్నారు. ఇలాంటివేళలో వాతావరణ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. మూడు రోజుల పాటు అవసరమైతే తప్పించి బయటకు రావొద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందని చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే వీలుందని చెప్పిన వాతావరణ శాఖ.. గడిచిన కొన్ని రోజుల కంటే ఈ మూడు రోజులు ఉష్ణోగ్రతలు రెండు.. మూడు డిగ్రీలు ఎక్కువ నమోదయ్యే వీలున్నట్లుగా అంచనా వేస్తున్నారు.

పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్న వేళ.. ఉదయం వేళలో అవసరం ఉంటే తప్పించి ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. వీలైనంతవరకు ఇంటికే పరిమితం కావాలని.. ఒకవేళ బయటకు వచ్చినా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే వీలుందని చెబుతున్నారు. సో.. ఈ మూడు రోజులు కాసింత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.