నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పరిష్కరమే తమ లక్ష్యం - పరమట శ్యామ్ కుమార్
అమలాపురం: నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపడమే తమ ధ్యేయమని స్వతంత్ర అభ్యర్థి పరమట శ్యామ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి నడిపూడి, ఈదరపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిత్యం ప్రజల్లో ఉన్నాని, మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించి విజిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లును అభ్యర్ధించారు.
ప్రచారంలో భాగంగా అడుగడుగునా మహిళల హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఉపాధి హామీ కూలీలును కలిసి విజల్ గుర్తులు ఓటు వేయాలని కోరారు. శ్యామ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, ప్రజలు కష్టం తెలిసిన వాడిగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు, రోడ్డు నిర్మాణ సమస్యలు, వంతెన సమస్యలు, రైతు సమస్యలు, కార్మికలు సమస్యలు కోసం పనిచేస్తానని, అవినీతికి తావులేకుండా పాలన అందిస్తానని అన్నారు.
పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి శ్యామ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యళ్ల జగ్గారావు, ఇంటూపల్లి నాగబాబు, నాగపు రాంబాబు, జాంగా బుజ్జి, గుత్తుల కృష్ణ, తొత్తరముడి నాగేశ్వరరావు, యళ్ల భద్రరావు, నందుల సత్య నాయడు, బడుగు చందు, పరమట భీమ మహేష్, జిత్తుక సచిన్, పులుసుగంటి నాని, నక్కా బాలనాగ సురేష్, యళ్ల సత్యనారాయణ,. మరియ అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.