అమలాపురం ఎంపీని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సంఘ సభ్యులు



Dr.B R AMBEDKAR KONASEEMA: అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ ని డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలసి వారిని అభినందించి వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రతీష్టాలు పొందాలని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అమలాపురం మండల యూ.పీ.ఎఫ్ అధ్యక్షులు మాట్లాడుతూ.. డా బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధి పథంలో నడిపించాలని అనేక మంది ప్రజల మన్ననలు పొందాలని తండ్రి గంటీ బాలయోగి కంటే గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరారు. 


ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రెవ. కార్ల్ డేవిడ్ కొమానపల్లి, బిషప్ మొసలి స్పర్జన్ రాజు, కమిటీ సభ్యులు రెవ. నోబుల్ రాయ్, రెవ. సి.హెచ్ ఆనందరావు, రెవ. జోషఫ్, రెవ. జాన్ వేస్లీ, రెవ. నానిబాబు మోర్త, అమలాపురం మండల యునైటెడ్ పాస్టర్స్స్ ఫెలోషిప్ మీడియా ప్రతీనిధి మన్నా జూబ్లీ చర్చ్ అసిస్టెంట్ పాస్టర్ రెవ. నరేష్ తాతపూడి, సంఘపెద్ధలు పెదపూడి చంద్రపాల్, తోత్తరమూడి పరంజ్యోతి, ఉందుర్తి సత్యనారాయణ, పెదపూడి జాన్ వేస్లీ, పెదపూడి పవన్ తదితరులు పాల్గొన్నారు.