శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలు అభివృద్ధి చేయాలి.: అఖిల భారత విద్యార్థి సమాఖ్య


డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ రవికుమార్ 


డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలనీ ఆగస్టు 27, 28, 29 తేదీలలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి కె. సత్తిబాబు మాట్లాడుతూ భారతదేశంలో విద్యకు 6% బడ్జెట్ కేటాయింపులు కావాలని, రాష్ట్రాల్లో వసతి గృహాలకు ప్రత్యేక బడ్జెట్ కావాలని, నిరుపేద, బడుగు బలహీనర్గాలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ విద్యా వ్యవస్థ కాపాడాలని కోరారు. 

లేని పక్షంలో విద్యార్థులు నిరుద్యోగులుగా నిరుద్యోగులు నిరుత్సాహకులుగా మారి ఈ దేశానికి ఉపయోగపడే పౌరులుగా మారలేకపోతున్నారు. విద్యార్థి, యువజన సంఘాలు చేసే ఈ పోరాటాల్లో మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం AISF జిల్లా కన్వీనర్ రవికుమార్ మాట్లాడుతూ ఇంకెన్నాళ్ళు విద్యార్థులు శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలలో మగ్గిపోవాలి, పేద విద్యార్థులు ప్రభుత్వానికి పట్టరా, దోమల నుండి రక్షణకి కిటికీలకు మెస్ లు ఉండవు, నాణ్యమైన ఆహారం ఉండదు, బెడ్స్ ఉండవు నేల మీద పడుకోవాలి, ట్యూటర్ లు లేరు, వాచ్మెన్లు లేక కుక్ లు ఆ డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది, మంచి నీటి ప్లాంట్స్ ఉన్నాయి కానీ వాటిని మరమ్మతులు చేయించక పక్కన పెట్టేసి ఉన్నాయి, బాలిక వసతి గృహాలు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అన్న క్యాంటీన్ లో మూడు పూటలకి 90 రూపాయలకి నాణ్యమైన ఆహారం దొరికినపుడు 50 రూపాయలకి వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఎలా దొరుకుతుంది అని ప్రభుత్వం ఆలోచన చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య గా డిమాండ్ చేస్తున్నాం.

ఈ శిబిరానికి ముఖ్య అతిథిలుగా STU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దొరబాబు, పల్లం రాజు విచ్చేసి శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. స్టూడెంట్ లో సగం stu అని స్టేట్ టీచర్స్ యూనియన్ గా విద్యార్థులకు నాణ్యమైన విద్య, మిడ్ డే మీల్స్ అందించాలని, అలాగే ఖాళీగా ఉన్న ఉపాద్యాయ పోస్టులను భర్తీ చేయాలని, అఖిల భారత విద్యార్థి సమాఖ్య చేస్తున్న రిలే నిరాహారదీక్షలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకట్, సతీశ్, ప్రసాద్, ఉదయ్, చిరు, పవన్, మొహమ్మద్, నాని, వందల మంది హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.