విశాఖ ఉక్కుపై కేంద్రం తీపి కబురు.. రూ.11,500 కోట్ల ప్యాకేజీ.. నేడే కీలక ప్రకటన!


విశాఖపట్నం జిల్లా: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కితగ్గినట్టు తెలుస్తోంది. ఉక్కు పరిశ్రమకు కొత్త ఊపిరులూదేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇందుకు రూ.11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ సమకూర్చాలని నిర్ణయించినట్లు భోగట్టా. గురువారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్వర్యంలో జరిగిన కేంద్ర ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు దీనిపై శుక్రవారం సంయుక్తంగా అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇటీవల ఏపీలో ప్రధాని పర్యటన సందర్భంగానూ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించి.. ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీలో ఆర్దిక ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ గత రెండేళ్లుగా కార్మికులు, ఉద్యోగ సంఘాలు ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

ఏటా 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ గత కొన్నేళ్ల నుంచి నష్టాలను ఎదుర్కొంటోంది. 2023-24లో రూ.4,848.86 కోట్లు, అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో రూ.2,858.74 కోట్ల నష్టాలను చవిచూసింది. వర్కింగ్ క్యాపిటల్‌ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం.

ఏటా 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ గత కొన్నేళ్ల నుంచి నష్టాలను ఎదుర్కొంటోంది. 2023-24లో రూ.4,848.86 కోట్లు, అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో రూ.2,858.74 కోట్ల నష్టాలను చవిచూసింది. వర్కింగ్ క్యాపిటల్‌ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో స్టీల్‌ ప్లాంట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.