పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్


విజయవాడ: మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లు సోమవారం మధ్యాహ్నం నుండి పాఠశాల ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

SSC పబ్లిక్ పరీక్షల, మార్చి-2025 హాల్ టిక్కెట్లను వాట్సాప్ - మన మిత్ర ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేలా తొలిసారిగా ప్రక్రియ ప్రారంభించామన్నారు.

వాట్సాప్ లో ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు..
• అభ్యర్థులు వారి WhatsApp ద్వారా 9552300009 కి "Hi" అనే సందేశాన్ని పంపాలి.
• "Choose Service" లేదా "సేవను ఎంచుకోండి"పై క్లిక్ చేయాలి.
• తర్వాత "Education Services" లేదా "విద్యా సేవలు"ని ఎంచుకోండి.
• తర్వాత "SSC Hall Ticket"ని ఎంచుకోండి. తర్వాత విద్యార్థి "Application Number" / "Child ID" మరియు పుట్టిన తేదీని నమోదు చేసి, స్ట్రీమ్‌ను ఎంచుకుని, మీ WhatsApp నంబర్‌లో మీ హాల్ టికెట్‌ను స్వీకరించడానికి "Confirm"పై క్లిక్ చేయండి.
* వివరాలు సరి చూసుకోవాలి*

పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాల్ టికెట్‌లో విద్యార్థుల వివరాలైన పేరు, పుట్టిన తేదీ, మాధ్యమం, ఫోటో, సంతకం, సబ్జెక్టులు మొదలైనవన్నీ పూర్తిగా సరిచూడాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అభ్యర్థి వివరాల్లో సబ్జెక్టు సరిపోలకపోతే, సంబంధిత ప్రధానోపాధ్యాయులు వెంటనే dir_govexams@yahoo.com లేదా dir_govexams@apschooledu.in ఇమెయిల్ ద్వారా దిగువ సంతకం చేసినవారి దృష్టికి తీసుకురావాలని సూచించారు.