విజయనగరంలో ఉగ్ర కుట్ర మూలాలు ? ఐసిస్ ఆదేశాలతో బాంబుల తయారీ..! రిమాండ్ రిపోర్టులో షాకింగ్..!


ANDRAPRADESH, VIJAYANAGARAM: ఓవైపు కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నుంచి కోలుకోకముందే భారత్ లో మరో కల్లోలం రేపేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారీ కుట్ర చేసింది. BY: BCN TV NEWS తెలుగు రాష్ట్రాల కేంద్రంగా జరిగిందని భావిస్తున్న ఈ కుట్రను పోలీసులు ఛేదించారు. ఏపీలోని విజయనగరం జిల్లాలో ఇద్దరు అనుమానిత తీవ్రవాదుల్ని అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పర్చి రిమాండ్ కు పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.


విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్, సమీర్ అనే అనుమానిత తీవ్రవాదులు కర్నాటక, మహారాష్ట్రకు చెందిన నలుగురు యువకులు కలిసి మొత్తం ఆరుగురు ఇన్ స్టా లో గ్రూప్ తయారు చేసుకుని సమాచారం పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉంటూ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు సమాచారం. సౌదీలో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వీరు బాంబులు కూడా తయారు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

మొత్తం ఆరుగురిలో ఇద్దరికి బాంబులు తయారు చేసేలా, మిగతా నలుగురికి బాంబులు ఎక్కడెక్కడ పెట్టాలో సౌదీ నుంచి ఐసిస్ హ్యాండ్లర్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటి ప్రకారం సిరాజ్, సమీర్ అనే ఇద్దరు యువకులు విజయనగరం జిల్లాలో బాంబులు తయారు చేసి వాటిని రంపచోడవరంలోని అటవీ ప్రాంతంలో పరీక్షలు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ బాంబుల్ని పేలుళ్లకు వాడకముందే పోలీసులు గుర్తించి వీరిని అరెస్టు చేసినట్లు సమాచారం. వీరిని కోర్టులో హాజరుపర్చాక మరిన్ని విషయాలు బయటపడే అవకాశముంది.