ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా జయవరపు శ్రీరామ్ మూర్తిని నియమించాలి


ఏలూరు జిల్లా/ఏలూరు, టి. నరసాపురం: పార్టీలో కష్టపడిన వారికి తగిన ఫలితం లభిస్తుందని టీ నర్సాపురం తెలుగుదేశం పార్టీ మండలం అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ అన్నారు. మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఏల్లూరు జిల్లా అధ్యక్షులు ఎంపిక విషయంలో చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ నాయుడు ఆలోచించాలని, పార్టీ కోసం ఆహాన్నిసులు కృషి చేసిన జయవరపు శ్రీరామ్ మూర్తిని జిల్లా అధ్యక్షులుగా నియమించాలని ఈ సందర్భంగా కోరడమైనది.


తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీలోనే ఉండి, ఎన్నో సేవలు చేసిన జయవరపు శ్రీరామ్ మూర్తిని జిల్లా అధ్యక్షులుగా నియమించాలని లేదా దానికి తగినట్టు సమీచితమైన పదవిని ఇచ్చి న్యాయం చేయాలని వారు అన్నారు. పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీకి ఎమ్మెల్యే సీటు కేటాయించినప్పుడు ఎంతో కష్టపడి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ గెలుపుకు అహర్నిశలు పనిచేశారని అన్నారు. గతంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నో సేవలు అందించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.


1987 నుండి 1998 వరకు టీ నర్సాపురం మండలానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా పనిచేసి పార్టీ ప్రతిష్ట కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. 1992 నుంచి 2016 వరకు పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కోశాధికారిగా పని చేశారని తెలిపారు. 2010 నుంచి 2014 వరకు రాష్ట్ర వాణిజ్య విభాగ కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. అంతేకాకుండా మండలంలో పార్టీకి ఆర్థికంగా ఖర్చు చేస్తూ పార్టీ బలోపేతానికి ఎంతో కష్టపడిన జయవరపు శ్రీరామమూర్తిని ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడం వారికి తగిన న్యాయం చేసిన వారు అవుతారని ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించాలని అందరూ సహకరించాలని కోరారు.


తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కొండపల్లి రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో మండలం నుంచి జిల్లా స్థాయికి ఎదిగిన జయవరపు శ్రీరామ్మూర్తిని జిల్లా అధ్యక్షులుగా బలపరచడం ఆర్యవైశ్యులకు ఒక అవకాశం కల్పించేట్టుగా అవుతుందని పార్టీ క్యాడర్ నాయకులను కోరడమైనది. జయవరపు శ్రీరామ్ మూర్తిని ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నియమించడం వలన ఆర్యవైశ్యుల మద్దతు పార్టీకి పూర్తిగా లభిస్తుందని తెలిపారు. 

లోకేష్ బాబు తో జయవరపు

2003 నుంచి 2005 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా పనిచేసి ఆర్యవైశ్యులలో మంచి పేరు సంపాదించారని, అటువంటి వ్యక్తి జిల్లా అధ్యక్షునిగా నియమించడం పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. గోదావరి పుష్కరాల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదగా అన్నదాన నిర్వహణ కార్యక్రమాన్ని జయవరపు శ్రీరామ్మూర్తి చేసిన కృషిని గుర్తు చేశారు. 


జిల్లా కేంద్ర గ్రంథాలయం ద్వారా పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు అందించిన ఉచిత శిక్షణ వలన 22 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. జయవరపు శ్రీరామ్ మూర్తి గ్రంధాలయ చైర్మన్ గా పనిచేస్తున్నప్పుడు సుమారు 70 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేతవరం గ్రామానికి హైస్కూల్ నిర్మాణానికి రెండు ఎకరాల భూమిని ఇచ్చిన ఆయన దాతృత్యాన్ని పార్టీ గుర్తుంచి వారికి సముచితమైన న్యాయం చేయాలని కోరారు.


అనంతరం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 72 వేల రూపాయల నగదు చెక్కును కోరుకొండ వెంకట భద్రానికి మండల అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ మరియు రాష్ట్ర నాయకులు జయవరపు శ్రీరామ్మూర్తి చేతుల మీదగా అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాసనేని మాధవరావు, రామలింగేశ్వరరావు, గెద్దల శ్రీను, కోరుకొండ వీర ఆంజనేయులు, జగ్గారావు, బుజ్జిబాబు. పొలగాని నాగేంద్ర, కోరుకొండ వెంకట భద్రం, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now