రోలెక్స్ వాచీ చోరీ కేసు.. పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్..

నగరంలో ఇటీవల హల్‌చల్ చేసిన ఓ నకిలీ ఐపీఎస్‌ను పట్టుకునే క్రమంలో చేతివాటం ప్రదర్శించి అతడి ఇంట్లో రోలెక్స్ వాచీ కొట్టేసిన కానిస్టేబుల్‌ను పట్టుకున్నారు పోలీసులు. అతడిపై కేసు నమోదు చేసి శాఖా పరమైన చర్యలకు సిద్ధమైంది పోలీస్ శాఖ.


TELANGANA, హైదరాబాద్: నగరంలో ఇటీవల ఓ నకిలీ ఐపీఎస్ అధికారిని అరెస్ట్(Fake IPS Officer Arrest) చేసే క్రమంలో.. అతడి ఇంట్లో చోరీకి గురైన రోలెక్స్ వాచీ(Rolex Watch) దొంగను పట్టుకున్నారు పోలీసులు. నిందితుణ్ని అదుపులోకి తీసుకునే తరుణంలో శ్రీరాములు శరణ్ కుమార్(Sriramulu Sharan Kumar) అనే పోలీస్ కానిస్టేబులే వాచీని కాజేసినట్టు తేలింది. దీంతో సదరు పోలీస్ ఉద్యోగిని ఫిల్మ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏం జరిగిందంటే.?
హైదరాబాద్(Hyderabad) ఏరియాలో ఇటీవల తాను ఐపీఎస్ అధికారినంటూ శశికాంత్(Sasikanth) అనే వ్యక్తి కొన్నిరోజులుగా హల్‌‌చల్ చేశాడు. విషయం బయటపడటంతో ఆ నకిలీ అధికారిని అదుపులోకి తీసుకునేందుకు అతడి ఇంటికెళ్లారు పోలీసులు. ఈ అరెస్ట్ ఘటననంతా శ్రీరాములు శరణ్ కుమార్ అనే కానిస్టేబుల్ వీడియో తీశాడు. ఈ తరుణంలో ఆ ఇంట్లో ఉన్న రోలెక్స్ వాచీపై కన్నేసి.. దాన్ని కాజేశాడా కానిస్టేబుల్(Rolex Watch Stolen). 

తాను తీసిన వీడియోలో కనిపించకుండా చాకచక్యంగా అపహరించి జేబులో వేసుకున్నాడు. అయితే.. ఇంకో కానిస్టేబుల్ తీసిన వీడియోలో ఇతడి చేతివాటం బయటపడింది. దీంతో సదరు కానిస్టేబుల్‌ను దొంగగా గుర్తించారు పోలీసులు. సెక్షన్ 316(5) ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం.. శ్రీరాములు శరణ్ కుమార్‌పై శాఖా పరమైన చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమైంది.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now