అమరావతి విశిష్ట సేవా పురస్కార్–2025 అందుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ శివరామకృష్ణ


ఏలూరు జిల్లా, నూజివీడు/విజయవాడ: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) సారథ్యంలో ఘనంగా నిర్వహించిన పి4 మార్గదర్శకుల మహోత్సవం కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు విశేష గౌరవం లభించింది.


ఛాంబర్ ఆఫ్ రియాల్టర్స్ & బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ప్రముఖ యాంకర్ శ్రీమతి ఉదయభాను చేతుల మీదుగా Helping Hands Telugu States Founder మరీదు శివరామకృష్ణ కి “అమరావతి విశిష్ట సేవా పురస్కార్ – 2025” ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామంతపూడి చైతన్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ నాగుర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ.. నూజివీడు మండలం పాత రావిచర్లలో యూత్ కమిటీగా ప్రారంభమైన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 వేల మంది సభ్యులు, 6 వేల మంది రక్తదాతలతో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా విస్తరించిందని తెలిపారు.

రక్తదానం, అన్నదానం, అనాథ పిల్లలు మరియు వృద్ధాశ్రమాలకు నిత్యావసర సరుకుల పంపిణీ, చలికాలంలో దుప్పట్ల పంపిణీ, అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు వంటి అనేక సేవా కార్యక్రమాలను సంస్థ నిరంతరంగా నిర్వహిస్తోందన్నారు.

కరోనా కాలంలో 182 రోజుల పాటు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలకు గాను విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అవార్డు లభించిందని గుర్తు చేశారు. ఈ పురస్కారాలు హెల్పింగ్ హ్యాండ్స్‌లో సేవ చేస్తున్న ప్రతి సభ్యుడికీ అంకితం అని ఆయన పేర్కొన్నారు.

అమరావతి విశిష్ట సేవా పురస్కార్ – 2025 లభించిన సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు, శ్రేయోభిలాషులు శివరామకృష్ణ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.



WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now