ANDRAPRADESH, NELURU: ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, యువనాయకులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఐదవసారి నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా చేజర్లకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది.
ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు చేజర్లను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయడంలో చేజర్ల పాత్ర కీలకమని ప్రశంసిస్తూ, భవిష్యత్తులోనూ తెలుగుదేశం పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన నాయకత్వం మరింత తోడ్పడుతుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.
