అవాంఛిత గర్భాలను నిరోధించేందుకు దుష్ఫ్రభావాలు చూపని ఏకైక సాధనం.. కండోమ్ వినియోగం. ప్రపంచ వ్యాప్తగా పలు దేశాల్లో కండోమ్ వినియోగం 2015తో పోల్చితే.. 2025నాటికి 80 శాతం మేరకు పెరిగింది.
అవాంఛిత గర్భాలను నిరోధించేందుకు దుష్ఫ్రభావాలు చూపని ఏకైక సాధనం.. కండోమ్ వినియోగం. ప్రపంచ వ్యాప్తగా పలు దేశాల్లో కండోమ్ వినియోగం 2015తో పోల్చితే.. 2025నాటికి 80 శాతం మేరకు పెరిగింది. భారత్‌లో కండోమ్‌లను అత్యధికంగా వినియోగిస్తున్న నగరం.. అందరూ అనుకున్నట్టుగా ముంబై కాదు... ఇండోర్(మధ్యప్రదేశ్.) తర్వాత స్థానంలో హైదరాబాద్ ఉందని ఇటీవలే గణాంకాలు వెల్లడయ్యాయి. ఇక.. మూడోస్థానంలో ముంబై ఉంది. ఇదిలావుంటే.. కండోమ్‌ల వినియోగాన్ని ఒకప్పుడు తప్పుగా, సిగ్గుగా భావించేవారు. కానీ, రానురాను కండోమ్‌లు చిల్లర దుకాణాల్లోనూ విక్రయిస్తున్న విషయం తెలిసిందే.
మన దేశం విషయానికి వస్తే.. కండోమల్‌పై ఎలాంటి నియంత్రణా, పన్నులు కూడా లేవు. విదేశీ తయారీ కండోమ్‌లపై మాత్రమే పన్ను ఉంది. స్వదేశీ తయారీ కండోమ్‌లపై స్థానిక సెస్సులు మినహా.. మన దగ్గర ఎలాంటి పన్నులు విధించడం లేదు. ఎయి డ్స్ నివారణలో భాగంగా.. 1995లో తీసుకున్న నిర్ణయమే నేటికీ అమలు అవుతోంది. అయితే.. తాజాగా మన పొరుగు దేశం చైనాలో కండోమ్‌లపై పన్ను విధిస్తున్నారు. దీనికి సంబంధించి షి.జిన్‌పింగ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కండోమ్‌లపై 13 శాతం పన్నును విధిస్తున్నట్టు పేర్కొంది.ఇలా కండోమ్‌లపై పన్ను విధించడం చైనాలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కేవలం కండోమ్‌లపైనే కాకుండా.. గర్భనిరోధక మాత్రలు, ఔషధాలపై కూడా.. పన్నులు విధిస్తూ..చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధానంగా చైనా చెబుతున్న రీజన్.. దేశంలో జనాభా రేటును పెంచడమే. ఇటీవలకాలంలో దేశంలో వివిధ కారణాలతో.. పురుషులు, మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో కుటుంబంలో ఎవరూ పిల్లల సంరక్షణ చర్యలు తీసుకునేందుకు అందుబాటులో లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో పిల్లలు వద్దునుకునే దంపతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది వ్యక్తిగత విషయమేనని అనుకున్నా.. చైనా జాతీయ స్థాయిలో జననాల రేటు తగ్గి.. భవిష్యత్తులో జనాభా అత్యల్ప స్థాయికి పడిపోయే ప్రమాదం ఏర్పడింది.
దీనివల్ల దేశ జీడీపీ కూడా తగ్గిపోతుంది. ఇది ఆర్థికవ్యవస్థపైనా.. ప్రపంచంలో చైనా దక్కించుకున్న స్థానంపైనా ప్రభావం చూప నుంది. ఈ నేపథ్యంలోనే చైనా గత ఏడాది అక్టోబరులోనే `పిల్లలను కనండి.. ` పేరుతో కీలక పథకాలను ప్రకటించింది. ప్రజా రవాణాను ఉచితం చేసింది. మాతృత్వ, గర్భిణీ సెలవులను రెట్టింపు చేసింది. ప్రభుత్వ పథకాలతోపాటు.. విద్యుత్తు, మొబైల్ బిల్లులను కూడా మహిళలకు(పిల్లల్ని కనేవారికి) ఉచితం చేసింది. ఇలా.. అనేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. అయినా.. జననాల రేటు పెరగకపోగా.. కండోమ్‌ల వినియోగం భారీ స్థాయిలో పెరిగింది. దీంతో ఇప్పుడు కండోమ్‌లపై నియంత్రణ కోసం.. పన్నులు విధించింది. మరి ఇప్పటికైనా చైనా ప్రజలు పిల్లల్ని కనే విషయంలో మనసు మార్చుకుంటారో లేదో చూడాలి.
