గుడివాడ బస్ ప్రయాణ ప్రాంగణం నూతన భవన శంకుస్థాపన.


ముఖ్య అతిథులుగా హాజరైన గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు, ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు..


గుడివాడ, డిసెంబర్ 23: ఎన్నో ఏళ్ల గుడివాడ నియోజకవర్గ కల 6 కోట్ల వ్యయంతో చేపట్టిన గుడివాడ బస్ ప్రయాణ ప్రాంగణం శంకుస్థాపన మంగళవారం సాయంత్రం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు హాజరై వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. 

అనంతరం మీడియా సమావేశంలో ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ సమస్యకు నేడు శాశ్వత పరిష్కారానికి బాటలు పడ్డాయన్నారు. రూ.6 కోట్ల అంచనాలతో గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులకు మా ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, APSWC చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేయడం వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆయన అన్నారు.. 

బస్టాండ్ అంటే గుడివాడ ప్రజలకు భావోద్వేగంతో కూడుకున్న అంశమని, కొద్దిపాటి వర్షం పడితేనే ప్రయాణికులు ఇబ్బందులు పడే పరిస్థితికి ముగింపు పలకడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ఎమ్మెల్యే కొడాలి నాని కేవలం బూతులు తిట్టడానికే పరిమితం అయ్యారు తప్ప గుడివాడలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. 

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో గుడివాడలో ఎన్నో ఏళ్లుగా  అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సైతం ఒక్కొక్కటిగా ప్రస్తుత ఉన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. 

రాష్ట్రంలో కూటమి పాలనలో తొలి బస్టాండ్ నిర్మాణం గుడివాడలోనే ప్రారంభం కావడం నిజంగా మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. గుడివాడ బస్టాండ్ ను రాబోయే 50 ఏళ్లకు కూడా ఉపయోగపడేలా మోడల్ బస్టాండ్ గా అభివృద్ధి చేయాలని చైర్మన్ కొనకల్లు నారాయణరావు ని విజ్ఞప్తి చేశారు. 

అవసరమైతే అదనపు నిధులు వెచ్చించైనా సరే ప్రయాణికుల సౌకర్యమే కేంద్రంగా ఈ బస్టాండ్ ను అభివృద్ధి చేస్తామని చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీ రత్నం, RM, స్థానిక టిడిపి నాయకులు పిన్నమనేని బాబ్జి,  జనసేన నాయకులు శ్రీకాంత్, పుష్పలత, సునీల్, ఈడి మోహన్, మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు..
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now