7 మంది కమిటీ సభ్యులతో కత్తి ప్రణీత మృతిపై విచారణ
నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలం, కృష్ణాపురంలోని జవహర్ నవోదయ (JNV) స్కూల్ ను శుక్రవారం రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ పర్యటించడం జరిగింది.
గత నెల 19న నవోదయ స్కూల్లో మృతి చెందిన కత్తి ప్రణీత పదో తరగతి విద్యార్థి కేసు నమోదు చేసిన పోలీసులు నేటికీ నెల రోజులు గడుస్తున్న ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి విచారణలో జాప్యం జరిగిందని విద్యార్థి తల్లిదండ్రులు కత్తి రవి, లక్ష్మి ఆరోపణలు మేరకు 7 మంది సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ కృష్ణాపురం నవోదయ స్కూల్ ని సందర్శించడం జరిగింది.
కత్తి ప్రణీత మృతిపై పలు అనుమానాల అనేక విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి స్కూల్ యాజమాన్యాన్ని, ఈ కేసులో ఉన్న ఆత్మకూరు డిఎస్పి ఐఓ గారిని మరియు ఇతర అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న నిజ నిర్ధారణ కమిటీ.
నిజ నిర్ధారణ కమిటీ దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఈ ఘటనపై పత్రిక, మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు.
నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు సీనియర్ న్యాయవాది అరవ పార్వతయ్య, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసి పెంచలయ్య, జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ మెంబర్ కొప్పాల రఘు, ముస్లిం మైనారిటీ నాయకులు ఎస్.కె ఖాజా రసూల్, గిరిజన సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, మల్లిక ఇందిరమ్మ, ఉపాధ్యాయుల సంఘం నేతలు మాల్యాద్రి పాల్గొన్నారు.
