రంగా కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటన... బలమైన రాజకీయ శక్తిగా


ANDRAPRADESH, VIJAYAWADA, VISAKHAPTNAM: ఏపీ వ్యాప్తంగా త్వరలో పర్యటిస్తాను అని దివంగత నేత వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశా కిరణ్ ప్రకటించారు. విశాఖ రంగా 37 వ వర్ధంతి సందర్భంగా విశాఖలో రంగా నాడు పేరుతో జరిగిన భారీ బహిరంగ సభలో ఆశా కిరణ్ ముఖ్య అతిధిగా హాజరై ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. రంగా ఆశయాలను తాము కొనసాగిస్తామని అన్నారు రంగా పేదల పక్ష పాతి అని ఆమె చెబుతూ ఎంతో మంది ప్రతీ నిత్యం సహాయం కోసం ఆయన వద్దకు వచ్చేవారు అని అలాంటి ప్రజా నేతను చంపేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. 


సరైన గుర్తింపు రాలేదు : 
పేదల కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి వంగవీటి రంగా పొరాడారు అని ఆమె చెప్పారు. ఇంత చేసినా రంగాకు తగిన గుర్తింపు అయితే రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ కానీ టీడీపీ జనసేన కానీ రంగా కోసం ఏమి చేశాయో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. కనీసం క్రిష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టలేకపోయారు అని నిందించారు. ఇప్పటికైనా ఆయన పేరు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. 

అధికారం అడ్డుపెట్టుకున్నారు : 
విశాఖలో తమ సభ జరగకుండా కొన్ని అరాచక శక్తులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆటంకాలు సృష్టించాయని ఆశా కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకుండా భయపెట్టాలని చూశారని ఆమె నిందించారు. మూడు సభా స్థలాలు మార్చారని ఆమె ఫైర్ అయ్యారు. అయినప్పటికీ రంగా మీద అభిమానంతో అత్యధిక సంఖ్యలో అభిమానులు తరలి రావడం ఆనందకరమని ఆమె అన్నారు. తాము ఎవరికీ భయపడేది లేదని రంగా రక్తం తమలో ఉందని ఆశా కిరణ్ చెప్పారు. 

రంగా ఆశయాల కోసం : 
ప్రతీ పేదకు ఇల్లు, ఉచితంగా విద్య వైద్యం,మహిళలకు రాజకీయ ప్రాధాన్యత బడుగు బలహీన వర్గాలకు సమాజంలో గుర్తింపు ఉండాలని రంగా పరితపించారని ఆమె చెప్పారు. వాటి సాధన కోసం తాము కృషి చేస్తామని ఆశ కిరణ్ చెప్పడం విశేషం. 

రాష్ట్రమంతా తిరిగి : 
ఇదిలా ఉంటే రాధా రంగా మిత్రమండలికి ఊపిరి పోస్తామని రాష్ట్రమంతా తిరిగి రంగా లక్ష్యాలను నెరవేరుస్తామని సభా వేదిక నుంచి ఆయన కుమార్తె ఆశాకిరణ్ శపధం చేయడం విశేషం. ఇక రంగానాడుని నిర్వహించిన రంగ రాధా రాయల్ సంఘం అధ్యక్షుడు గాదె బాలాజీ మాట్లాడుతూ త్వరలోనే తామంతా ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తామని ప్రకటించడం విశేషం. వంగవీటి మరణించలేదని జనం గుండెలలో ఉన్నారాని రాధా కుమారుడు శంతన్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అభిమానులు రావడం కొత్త రాజకీయ శక్తిగా తాము వస్తామని చెప్పడంతో ఏపీలో కొత్త పార్టీ ఏర్పాటు అవుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now