ANDRAPRADESH, VIJAYAWADA: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జనాబ్ ముహమ్మద్ ఫారూక్ షిబ్లీ అధ్యక్షతన మైనారిటీ వెల్ఫేర్ శాఖ నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ వేడుకల శుభసందర్భాన్ని పురస్కరించుకుని 'సురూర్-ఎ-ఉర్దూ మహోత్సవ్' అత్యంత వైభవంగా 29-12-2025 (సోమవారం) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు.
ఈ సాంస్కృతిక వేడుకకు ముఖ్య అతిథులుగా న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖామాత్యులు జనాబ్ ఎన్.ఎండి. ఫరూక్, ప్రభుత్వ సలహాదారులు జనాబ్ ముహమ్మద్ అహ్మద్ షరీఫ్ విచ్చేయనున్నారు. విశిష్ట అతిథిగా మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి సీహెచ్ శ్రీధర్, I.A.S. పాల్గొంటారు.
గౌరవ అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని), శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర రావు(విజయవాడ సెంట్రల్), సుజనా చౌదరి(విజయవాడ పశ్చిమ), గద్దె రామ్మోహన్ రావు(విజయవాడ తూర్పు), బోడే ప్రసాద్(పెనమలూరు) పాల్గొననున్నారు. ఉర్దూ భాషా సౌరభాన్ని, సంస్కృతిని చాటిచెప్పే ఈ మహోత్సవానికి ఉర్దూ భాషాభిమానులు, శ్రేయోభిలాషులు మరియు ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ ముహమ్మద్ గౌస్ పీర్ విజ్ఞప్తి చేశారు.
