మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుతతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నేహ శర్మ. ఆ మూవీలో పొగరు ఉన్న అమ్మాయిలా నేహ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ తర్వాత కమర్షియల్ హీరోయిన్ అవుతుందని అంతా భావించినా.. ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
ఆ తర్వాత కాస్త తెలివిగా ఆలోచించి బాలీవుడ్ లో అడుగుపెట్టి ఇప్పటికి కూడా సందడి చేస్తోంది. మొదటి సినిమానే ఇమ్రాన్ హస్మీకి జోడీగా నటించింది. తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా ఏడాదికి ఒక్క సినిమా అయినా చేస్తోంది. అలా బీటౌన్ లో సెటిల్ అయిపోయింది. మరోవైపు, సోషల్ మీడియాలోనూ నేహా శర్మ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.
రెగ్యులర్ గా కొత్త కొత్త ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తుంటుంది. చిరుత సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎంత అందంగా ఉందో ఇప్పటికి కూడా అదే అందం తో అట్రాక్ట్ చేస్తోంది. అటు నార్త్ తో పాటు ఇటు సౌత్ లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. నేహా శర్మకు ఇన్ స్టాగ్రామ్ లో 20.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందంతో కనులవిందు చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఫుల్ డిజైన్ట్ పింక్ కలర్ గాగ్రా చోలీలో ఫొటోలు దిగి పోస్ట్ చేసింది. కొంటెగా చూస్తూ ఆకట్టుకుంటోంది. తన ఫ్యాన్స్ కు సంక్రాంతి విషెస్ చెబుతూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. నడుము అందాలను చూపిస్తూ అందాలు ఆరోబోస్తోంది. ప్రస్తుతం ఆమె పిక్స్ వైరల్ మారాయి.
సాధారణంగానే నేహా శర్మ చాలా అందంగా ఉంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అలాంటిది ట్రెడిషనల్ వేర్ లో మరింత అందంగా కనిపిస్తోందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందాన్ని సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు అని అంటున్నారు. నేహ అతి త్వరలోనే సౌత్ లో కూడా సినిమా లేదా సిరీస్ ద్వారా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.