చాలా రోజుల తర్వాత యానిమల్ సినిమాలో రష్మికకి మంచి పాత్ర దక్కడంతో ఈ సినిమాతో ఆమె క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ప్రజెంట్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న రెమ్యునరేషన్ కి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. యానిమల్ సక్సెస్ తో రష్మిక ఒక్కసారిగా రెమ్యునరేషన్ ని పెంచేసిందని, ప్రస్తుతం ఒక్కో సినిమాకు 4 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే విషయమై ఓ నెటిజన్ ట్వీట్ కి రష్మిక రెస్పాండ్ అయింది." ఇది చూసి నేనే షాక్ అయ్యా.. నాకు నిజంగానే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. నేను కూడా ప్రొడ్యూసర్స్ ని ఇదే అడుగుతా. సోషల్ మీడియాలో వచ్చిన దానికి కట్టుబడి ఉండేందుకు ఇలా చేస్తున్నా అని వారికి వివరిస్తాను" అంటూ ట్వీట్ చేసింది.
దీంతో ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా హీరోయిన్లకు వరుసగా రెండు హిట్స్ వస్తే వెంటనే రెమ్యునరేషన్స్ పెంచుతుంటారు. అందుకే హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే రష్మిక కూడా యానిమల్ సక్సెస్ తరువాత రెమ్యూనరేషన్ పెంచినట్లు న్యూస్ వచ్చింది. కానీ దీనిపై రష్మిక రియాక్ట్ అయిన విధానాన్ని చూస్తే అలాంటిదేమీ లేదనే విషయం స్పష్టమవుతుంది. ఇక ప్రస్తుతం రష్మిక 'పుష్ప 2' షూటింగ్ తో బిజీగా ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ఈ సినిమాతో పాటు రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లోనూ నటిస్తోంది.