కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు 10 లక్షల వరకు ఋణాలు


 
-నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

నెల్లూరు సిటీ నియోజకవర్గం 11వ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో నేడు టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గార్లకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల ముసుగులో అనేక అడ్డగోలు అప్పులు చేసి దోపిడీనే లక్ష్యంగా ఉండిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టేశారని అన్నారు. అనేక కులాల పేరుతో కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు కానీ ఆ కార్పొరేషన్ల ద్వారా ఎవ్వరికీ స్వయం ఉపాధి ఋణాలు ఇవ్వలేదని గుర్తుచేశారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వ సబ్సిడీ ఋణాలు వస్తుంటే జగన్ ప్రభుత్వంలో ఆ ఊసే లేదన్నారు. 

కానీ రాబోయే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఆ ఇబ్బంది ఉండదని, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు ఉన్నాయని, ఆ ప్రణాళికల ప్రకారం వెళ్తూ, మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, అగ్రవర్ణాల్లో పేదలకు, యువతకు స్వయం ఉపాధి నిమిత్తం ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఋణాలు అందిస్తారని అన్నారు. ఎంపీగా వీపీఆర్ గారిని, ఎమ్మెల్యేగా నారాయణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి రాబోయే ప్రభుత్వంలో మన నెల్లూరు నగర పాత్ర బలంగా ఉండేలా చేద్దామని కేతంరెడ్డి ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.