గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి నాయకులు మన్నవ మోహనకృష్ణ గురువారం తన కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ... కుల వ్యవస్థ నిర్మూలనకు మహిళోద్ధారకు జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు. అన్ని వర్గాలకు విద్య అవసరాన్ని సమర్థించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సామాజిక న్యాయం మహిళా సాధికారత ఉద్యమాలకు అధ్యుడుగా చేసిన సేవలు గురించి ప్రసంగించారు.
చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే మార్గంలోనే తాము ప్రయాణిస్తున్నట్లు మన్నవ మోహనకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి చిన్నకొండలరావు, 18వ డివిజన్ బీసీ నాయకులు మల్లెల కిషోర్, 35వ డివిజన్ మాజీ కార్పోరేటర్ పచ్చ వెంగయ్య, 36వ డివిజన్ మాజీ అధ్యక్షుడు నూలుపూరి శ్రీనివాసరావు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ బాజీ, గుంటుపల్లి గురవయ్య, చావల అప్పారావు మరియు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.