శ్రీకాకుళం: తనకు ఇవే చివరి ఎన్నికలంటూ ధర్మాన మరోమారు ప్రజలను మభ్యపెడుతున్నారని కూటమి అభ్యర్థి గొండు శంకర్ విమర్శించారు. నగరపరిధిలోని 12 వ డివిజన్లో తాళ్లూరి నవీన్, గోవర్ధనరావు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఎన్దియే కూటమి అవశ్యకతను ప్రజలకు తెలిపారు.
అదేవిధంగా గార మండలం వత్స వలస పంచాయతీలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు మహిళ అధ్యక్షరాలు గొండు స్వాతి శంకర్ గారి అధ్యక్షతన, కర్రి వాసు, తెలుకోటి ఎర్ర రావు, పేర్ల సత్యరాజు, పేర్ల లక్ష్మణరావు, పేర్ల మల్లేశు ఆధ్వర్యంలో ప్రజా గళం,బాబు సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సింగుపురం పంచాయితీ మామిడివలస. బగ్గువానిపేట గ్రామాల్లో మాజీ ఎంపీపీ గొండు జగపతిరావు కూటమి అభ్యర్థి గొండు శంకర్ తరపున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా గొండు శంకర్ మాట్లాడుతూ. ధర్మాన మంత్రిగా అయిదేళ్లలో నియోజక అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదన్నారు. తెలుగుదేశం హయాంలో చేపట్టిన పనులు కూడా పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. తనకు ఎమ్మెల్యే గా పోటీ చేయడం ఇష్టం లేదని, జగన్మోహనరెడ్డి పోటీ చేయమనడంతో తప్పడం లేదంటూ ప్రజల సానుభూతికోసం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన మరోమారు గెలిస్తే ప్రజాసేవ చేసే అవకాశమే లేదని, ప్రజలు కలిసేందుకు కూడా అనుమతించరని అన్నారు.
వైకాపా నేతల ప్రలోబాలకు గురికావద్దని. అభివృద్ధికి, రాష్ట్ర భవిష్యత్తుకు ఎన్దియే కూటమిని ఆదరించాలని, ఎమ్మెల్యే గా తనను, ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏ సందర్బంగా సున్నపు వీధికి చెందిన వికలాంగుడు తనకు పెన్షన్ అందడం లేదని శంకర్ వద్ద మొర పెట్టుకోగా తను ఎమ్మెల్యే గా ఎన్నికైన రెండునెలల్లో పెన్షన్ మంజూరు చేస్తానని, లేనిపక్షంలో తన నిధుల నుంచి అందజేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.