Tirumala: కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత టీటీడీ నుంచి ప్రక్షాళన మొదలైంది. అందులో భాగంగా గత అయిదేళ్ల కాలంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల పైన విజిలెన్స్ విచారణ మొదలైంది. అదే సమయంలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో నాణ్యత పైన ఫోకస్ చేసారు. తిరుమల అన్న ప్రసాదం..భోజనంలో మరింత నాణ్యత పెరిగేలా ఈవో సూచనలు చేసారు. తాజాగా టీటీడీ గత పాలక మండలి నిర్ణయాల పై తాజాగా అధికారులకు కీలక ఆదేశాలు అందాయి.
గత నిర్ణయాలు ఇక
కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే శ్యామలరావును టీటీడీ ఈవోగా నియమించారు. టీటీడీలో గతంలో చోటు చేసుకున్న అవకతవకలను పరి చేయటం పైనఈవో ఫోకస్ చేసారు. అందులో భాగంగా గత ప్రభుత్వ హయంలో రెండు పాలక మండళ్లు బాధ్యతలు నిర్వహించాయి. ఆ సమయంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను భక్తులకు అందుబాటులో ఉంచాలని ఈవో నిర్ణయించారు. ఈ మేరకు 2023 ఆగస్టు 7 నుంచి 2024 మార్చి 11 వరకు పాలక మండలి నిర్ణయాలు టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
నాణ్యతతో ఇవ్వాలి
అదే విధంగా వారి లడ్డు ప్రసాదాలు మరింత రుచిగా, నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో శ శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ అధికారులు, డైరీ నిపుణులతో ఆయన సమావేశం నిర్వహించారు. మరింత నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షిస్తున్న విధంగా కాకుండా మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలి తదితర అంశాలపై, అందుకు తీసుకోవలసిన మార్పులను తెలియజేయాలని ఆయన నిపుణులను కోరారు.
కొత్త బోర్డు పై కసరత్తు
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దర్శనం కోసం 18 గంటల సమయం పడుతోంది. ఇక..టీటీడీకి నూతన ఛైర్మన్ తో పాటుగా బోర్డు ఏర్పాటు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పలువురు ప్రముఖులు బోర్డులో సభ్యత్వం కోసం పోటీ పడుతున్నారు. ఛైర్మన్ రేసులోనూ ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వచ్చే నెల తొలి వారంలో ముందుగా ఛైర్మన్ నియామకం..ఆ తరువాత బోర్డు సభ్యుల నియామకం ఉంటుందని చెబుతున్నారు. ఇక..టీటీడీలో అధికార యంత్రాంగ ప్రక్షాళన పైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.