ఏలూరు జిల్లా: చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంగుటూరు మండలం కంసాలి గుంట గ్రామంలో 2023 సంవత్సరం జనవరి 16వ తేదీన పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి పేకాట నిర్వహిస్తున్న 23 వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 8,45,000/- నగదును 2023 సంవత్సరం డిసెంబర్ 29వ తేది నాడు గౌరవ న్యాయ కోర్టు వారి ఎదుట హాజరు పరచగా గౌరవ న్యాయస్థానం వారు ఒక్కారికి రూ.300/- లు జరిమానా విధించారు.
గౌరవ న్యాయస్థానం వారు చేబ్రోలు పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది నిర్వహించిన పేకాట శిబిరాల దాడులుపై గౌరవ కోర్టు వారు పోలీస్ సిబ్బందికి రూ.1,65,000 లు రివార్డు ఇచ్చారు.
ఆ రివార్డులు చెందిన చెక్కలు ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి చేబ్రోలు పిఎస్ లో పనిచేస్తున్న సిబ్బందికి గౌరవ న్యాయస్థానం వద్ద నుండి రాబడిన చెక్కులను సిబ్బందికి అందచేసి అప్పటి చేబ్రోలు ఎస్ఐ స్వామిని, వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.