న్యూఢిల్లీ/ఏలూరు జిల్లా ఏలూరు ప్రతినిధి: అదనంగా పండించిన పొగాకును అమ్ముకోవటానికి రైతులకు మరియు అధీకృత వేలం ప్లాట్ ఫారాలపై కొనుగోలు చేయటానికి వ్యాపారస్థులకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సునిల్ బర్త్వల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇది రైతుల విజయం అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రకటన ద్వారా తెలిపారు. సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సునిల్ బర్త్వల్ కి రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
అంతకు ముందు పొగాకు రైతుల సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి ఈ నెల 3వ తేదీన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తీసుకెళ్ళారు. రైతులకు మేలు చేసే జీవోను విడుదల కావడం పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేసారు.
ఈ నెల 10వ తేదీన దేవరపల్లిలో జరిగిన పొగాకు TII రైతు అవార్డుల వేడుకలో ముఖ్యఅతిధిగా హాజరైన ఎంపీ మహేష్ కుమార్ దృష్టికి పొగాకు రైతులు తీసుకుని వెళ్ళారు. మిచాంగ్ తుఫాన్ వల్ల పంట కోల్పోయిన వారికి తీరిగి ప్రభుత్వం అనుమతించిన దాని కంటే ఎక్కువ విస్తీర్ణంలో పొగాకు పండించమని, అదనంగా పండించిన పంటకు ఫెనాల్టీ లేకుండా కొనుగోలు చేయాలని ఎంపీ ని రైతులు కోరారు. వెంటనే స్పందించిన పుట్టా మహేష్ కుమార్ సంబంధిత మంత్రి పీయుష్ గోయల్ దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగింది.
అదనంగా పండించిన పంటకు ఎటువంటి అపరాధ రుసుం [ఫెనాల్టీ] లేకుండా అధీకృత ప్లాట్ ఫారాలపై పొగాకు అమ్ముకోవటానికి అనుమతులు మంత్రి పీయుష్ గోయల్ ను కోరిన వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం జిఓ విడుదల చేసారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఒక లైసెన్స్ ఉన్న రైతు 35 క్వింటాల్ పొగాకు పండించుకునే సామర్థ్యాన్ని 40 క్వింటలకు పెంచారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. త్వరలోనే పామాయిల్ రైతుల సమస్యలు కూడ పరిష్కరిస్తామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు.