డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం: ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ మార్కెటింగ్ ఛైర్మన్ గొలకోటి దొరబాబు పాత్రికేయులతో మాట్లాడుతు ఈ రోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన బడ్జెట్ గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా ఉందని అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ సొంత వ్యవహారంలకి ఆంధ్రప్రదేశ్ ని తాకట్టు పెట్టారని విమర్శించారు.
కాని ఇప్పుడు ఆ విధంగా కాకుండా రాజధాని అమరావతికి 15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇస్తామని ప్రకటించడం హర్షినియమని అన్నారు. తెలుగు దేశం, జనసేనా, బీజేపీ కూటమి ప్రభుత్వం రాబోవు 4 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని ఆర్థికంగాను అభివృద్దిలోను ముందుకు తీసుకువెళ్లుతుందని అన్నారు. ఆర్థికంగా అస్తవ్యస్తమైన రాష్టాని ఈ విధంగా ఆదుకునేందుకు అత్యంత ప్రాధాన్యత యిచ్చిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలసీతారమన్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్య మంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకి ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.