AMALAPURAM: అమలాపురం ప్రెస్‌క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అడ్‌హాక్ కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మహ్మద్ బషీర్, ప్రధాన కార్యదర్శిగా కాకర సుధీర్, ఉపాధ్యక్షునిగా పొట్టుపోతు నాగేశ్వరరావు(నాగు), కోశాధికారిగా ఎస్వీఎస్‌హెచ్‌హెచ్ హరిప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా మామిడిశెట్టి విష్ణుప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కడలి పల్లపురాజు, గౌరవ అధ్యక్షులుగా చొల్లంగి అప్పాజీ, సభ్యులుగా పరమట భీమామహేష్, గణపవరపు వీరవెంకటసత్యసాయి ప్రసాద్, అద్దంకి సత్యభాస్కరరావు, దొమ్మేటి వెంకట్, ఎమ్‌ఎస్‌ఏ హుస్సేన్(రాజా), ఆసు భరత్‌రామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అడ్‌హక్ కమిటీ సభ్యులు కొర్లపాటి ప్రదీప్‌కుమార్, చొల్లంగి శేఖర్‌బాబు, ఎండీ బషీర్, కాకర సుధీర్, ప్రెస్‌క్లబ్ పెద్దలు టీకే విశ్వనాధ్, పిండి శేషు, చొల్లంగి అప్పాజీల ఆధ్వర్యంలో ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని అమలాపురం ప్రెస్‌క్లబ్ ప్రింట్ మీడియా అధ్యక్షులు కొండేపూడి సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు రంబాల సత్యనారాయణ, టీకే విశ్వనాధ్, రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సభ్యులు కొర్లపాటి ప్రదీప్‌కుమార్, సీనియర్ జర్నలిస్టులు చొల్లంగి శేఖర్ బాబు, మద్ధింశెట్టి త్రిమూర్తులు, రంకిరెడ్డి రామకృష్ణ, పిండి శేషు, అబ్బాస్, ముక్కామల చక్రధర్, కాకిలేటి సూరిబాబు, మట్టపర్తి రమేష్, గారపాటి పండు బాబు తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.