బోర్వంచ గ్రామంలో మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్ధసారధి...
నూజివీడు/ఏలూరు: ముస్లీంల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడివుందని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. శుక్రవారం నూజివీడు మండలం బోర్వంచ గ్రామంలో మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పార్ధసారధి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లీంల సంక్షేమానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని చెప్పారు. మసీదులోవున్న స్కూలు పిల్లలకు ప్రతి సంవత్సరం వారి విద్యాబోధనలకు అవసరమైన టెస్టు బుక్కులు తమ ఆర్దిక వనరులతో అందజేస్తానని తెలిపారు. నూజివీడులో త్వరలో ముస్లీంల కు షాధీఖానా నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ముస్లీం పెద్దలు మాట్లాడుతూ స్వర్గీయ మాజీముఖ్యమంత్రి ఎన్ టిఆర్ హయాం నుండి ముస్లీం సంక్షేమానికి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు.
అదే విధంగా ప్రస్తుతం ప్రభుత్వం కూడా ముస్లీం సంక్షేమానికి ఎంతో తోడ్పాటునిస్తుందన్నారు. అనాధపిల్లల కోసం నిర్వహిస్తున్న పాఠశాలకు నిధులు కేటాయించాలని కోరారు. మక్కాకు వెళ్లేందుకు హాజ్ యాత్రకు ప్రభుత్వ పరంగా లక్ష రూపాయలు అందిస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హార్షదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో స్ధానిక జనసేన నాయకులు బర్మా ఫణిబాబు, దారుల్ ఉలూమ్ మొహమ్మదీయ ఎడ్యుకేషనల్ చార్టిబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు రియాజ్ ఖాద్రి, పాషాఖాద్రి, ఎస్ కె మున్షీ, రిజ్వాన్, అబ్డుల్ మన్నాన్(రియాజ్), ఎంఎ వజీర్, తదితరులు పాల్గొన్నారు.