ఇల్లు కూలి 8 రోజులు అవుతున్నా తిరిగి చూడని నాయకులు, అధికారులు


ANDRA PRADESH: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం కంభంపాడు ఎస్సీ కాలనీలో బుడుపుల మల్లయ్య కుటుంబం నివాసం ఉంటున్న ఇల్లు వర్షాలకు మట్టి గోడలు నాని తెల్లవారు జామున కూలిపోయింది. ప్రాణాపాయ నష్టం జరగలేదు. కానీ కొన్ని వస్తువులు మట్టి కింద పడిపోయాయి, తల దాచుకునేందుకు ఇబ్బందులు పడుతున్నా వైనం.

నిత్యావసర వస్తువులు అందించి  భరోసా కల్పిస్తారని ఎదురుచూస్తున్న గూడులేని కుటుంబం. 8 రోజులు గడుస్తున్నా బాధిత కుటుంబాన్ని పరామర్శించ లేదు, ఓట్లు సమయంలో కనపడ్డాము కానీ, ఇల్లు కూలిన సమయంలో కనపడలేదా మేము అని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now