ఇళ్ల స్థలం లేని నిరుపేదలందరూ 18న సచివాలయాల వద్దకు రండి: సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు


తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం: గత ప్రభుత్వంలో ఇళ్లపట్టాలు ఇచ్చి స్థలం చూపించకుండా లేకుంటే ఇళ్ల స్థలం ఉన్న కట్టుకోలేని నిరుపేదలందరూ అదేవిధంగా ఇల్లు లేని పేదలందరూ ఈ నెల 18న ఆయా వార్డు సచివాలయాల వద్దకు రావాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు.

మంగళవారం ఉదయం పిఠాపురం నియోజకవర్గంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా 
జగ్గయ్య చెరువు రథల పేట ఇందిరా నగర్ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు ప్రజల వద్ద నుండి అర్జీలు వ్రాయడం జరిగింది. మున్సిపల్ కార్మికులు జట్ల కార్మికులు వద్ద నుండి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.

ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు జిల్లా కార్యదర్శి కె బోడకొండ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పారని ఈ నేపథ్యంలో ఇల్లు లేని పేదలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్ల స్థలం చూపించలేదని వారందరూ సిపిఐ చేపడుతున్న అర్జీలు స్వీకరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మధు బాడుకొండ కోరారు. 

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు శాఖ రామకృష్ణ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అప్పారావు, సూర్యరావు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.