జాతీయ స్థాయి పోటీలకు 12 మంది విద్యార్ధినులు ఎంపిక
కృష్ణా జిల్లా ఊషు అసోసియేషన్ కార్యదర్శి బోడా వెంకట్ వెల్లడి
విజయవాడ: జాతీయ స్థాయి ఉమెన్స్ కేలో ఇండియా లీగ్ పోటీల్లో కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్ధినులు పాల్గొని తమ సత్తా చాటారని, పలువురు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కృష్ణా జిల్లా ఊషు అసోసియేషన్ కార్యదర్శి బోడా వెంకట్ తెలిపారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగిన ఊషు కేలో ఇండియా రాష్ట్ర స్థాయి పోటీల్లో కృష్ణా జిల్లా విద్యార్ధినులు 25మంది పాల్గొనగా వారిలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలకు సంబంధించి 12మంది జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటిన విద్యార్ధినులకు బహమతులు, ప్రశంసా పత్రాలు అందజేసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఊషు అసోసియేష రాష్ట్ర అధ్యక్షుడు ఎ.ఆదిశేషు, కార్యదర్శి బి.నరసింహరావు, ఉపాధ్యక్షుడు మోహన్ ముత్యాలరావు తదితరులు విద్యార్ధినులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పీహెచ్ హైస్కూల్ (ఇబ్రహీంపట్నం, విజయవాడ), పీఈటీ దీప, ఎస్.టి. డెనిడిక్స్ స్కూల్ (తాడేపల్లి) పీఈటీ డానియేల్ ప్రభాకర్, నిర్మలా హైస్కూల్ (మచిలీపట్నం) పీఈటీ బి.రేవంత్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.