సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూప్స్ లలో వైరల్ అవుతున్న 10వ తరగతి విద్యార్థుల విడియో ఆవాస్తవం: నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ జి.కృష్ణమోహన్


- జగజ్జీవన్ రావు కాలనీలో విద్యుత్ లేక చదువుకోవడానికి ఆటంకం కలుగుచున్నదని వైరల్ అవుతున్న వీడియోలో వాస్తవంలేదు.. ఆకివీడు నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ జి.కృష్ణమోహన్..

పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు: బాబు జగజ్జీవన్ రావు కాలనీలో నివాసం ఉంటున్నామని, మూడు నెలల క్రితం ఆక్రమణలుగా గుర్తించి మా కాలనీలోని నివాసాలకు కరెంటు తొలగించడం జరిగిందని, ప్రస్తుతం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నామని, కరెంటు లేక ఇబ్బంది పడుతున్నామని, వీధిలైట్లు కింద చదువుకోవడం జరుగుచున్నదని, దయచేసి కరెంటు ఇప్పించవలసిందిగా వైరల్ అవుతున్న విద్యార్థుల వీడియో పై ఆకివీడు నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ జి.కృష్ణమోహన్ వాస్తవ పరిస్థితులను నివేదిక ద్వారా వివరించడం జరిగింది.

వాస్తవంగా రికార్డుల ప్రకారం జగజ్జీవన్ రావు కాలనీ అనేది లేదని, ఆ ప్రదేశంలో స్మశానవాటిక లేక అమృతరావు కాలనీగా రెవిన్యూ రికార్డులలో నమోదయి ఉందని, ఆ ప్రాంతం ఆక్రమణలకు గురి కావడం వలన గత నాలుగు నెలల క్రితం వారికి ముందుగా నోటీసులు జారీ చేసి ఆ ప్రాంతాన్నికి విద్యుత్ ను నిలుపుదల చేయడం జరిగిందని తెలిపారు.  

వీడియోలో మాట్లాడుతూ వైరల్ అవుతున్న విద్యార్థులు వాస్తవంగా ఆ ప్రాంతంలో నివాసం ఉండటం లేదని, వారు వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారని, వారు ఉంటున్న ఇంటికి ఏ విధమైన విద్యుత్ అసౌకర్యం లేదని, చదువుకోవడానికి ఇబ్బంది లేదని స్పష్టం చేస్తూ నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ జి.కృష్ణమోహన్ వివరణ ఇవ్వడం జరిగింది.

వైరల్ అవుతున్న వీడియోను కొందరు స్వార్ధ ప్రయోజనాల కోసం విద్యార్థులను అడ్డం పెట్టుకోవడంగా జరిగిందని కమిషనర్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ఏ విధమైన అసౌకర్యం కలిగిన జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావచ్చని ఆకువీడు నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ జి.కృష్ణమోహన్ తెలిపారు.

వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ లలో విడియో వైరల్ చేయడం తగదని హితవు పలికారు. తప్పుడు వార్తలు ప్రచురిస్తే కఠినంగా చర్యలు ఉంటాయని తెలిపారు. నిజానిజాలు తమ దృష్టికి తీసుకుని వస్తే నాయ్యం చేయడం జరుగుతుందని తెలిపారు.