అడ్డతీగలలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ శిక్షణా కార్యక్రమం


కాకినాడ, జగ్గంపేట/రంపచోడవరం: అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగలలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఎన్ హెచ్ ఆర్ పి ఎఫ్ ఫారం శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ సీఈవో తూము రామచంద్ర నాయుడు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే మాధవి లత హాజరయ్యారు. వారికి నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా బాధ్యతలు వహిస్తున్న రాంప్రసాద్ సతీమణి శ్రీదేవి దంపతులు సంస్థ సభ్యులందరూ ఘన స్వాగతం పలికారు. 

ఈ కార్యక్రమానికి ఎన్ హెచ్ ఆర్ పీ ఫారం ఆంధ్ర రాష్ట్ర ఇన్చార్జ్ పి ఎ వలీ ఖాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఈఓ రామచంద్ర నాయుడు మాట్లాడుతూ సంస్థలో చేరిన ప్రతి సభ్యులు శిక్షణ పొంది అవగాహన కలిగి ఉండాలని అన్నారు. హ్యూమన్ రైట్స్, సివిల్ రైట్స్, యాంటీ కరప్షన్, సైబర్ క్రైమ్ మొదలగు వాటిపై అవగాహన కల్పించి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. 

నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె మాధవి లత మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని పొందపరచినటువంటి ఆర్టికల్స్ సెక్షన్ల పైన అవగాహన కలిగించి శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ అనంతరం రామచంద్ర నాయుడు మాధవి లత చేతుల మీదుగా సభ్యులందరికీ శిక్షణ సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా కన్వీనర్ ప్రేమ స్వరూప్, నియోజకవర్గ జాయింట్ సెక్రటరీ ముర్ల సూరిబాబు, రంపచోడవరం నియోజకవర్గం మహిళా విభాగం ఇంచార్జ్ ఏ శ్రీదేవి, నియోజకవర్గ కమిటీ సభ్యులు, రాజవొమ్మంగి మండలం, అడ్డతీగల మండలం, వై రామవరం మండలం, అప్పర్ ఏరియా మారేడుమిల్లి మండలం, రంపచోడవరం మండలాల ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు సెక్రెటరీ లు వర్కింగ్ ప్రెసిడెంట్లు సభ్యులు మహిళా విభాగా సభ్యులు తదితరులు సుమారుగా 100 మందికి పైగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 

ఈ సందర్భంగా ఇప్పటివరకు నియోజకవర్గ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు వహించిన ఏ రాంప్రసాద్ ని ఇకనుండి రంపచోడవరం నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగిస్తున్నట్టు సంస్థ సీ ఈ ఓ రామచంద్ర నాయుడు తెలియజేశారు.