చార్మినార్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి..


TELANGANA: హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్‌చౌక్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. గుల్జార్‌హౌస్ సమీపంలోని ఒక భవనంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం నాలుగు కుంటుంబాల సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. భవనంలో మొత్తం 30 మంది సభ్యులు ఉండగా.. అందులో రెస్క్యూ సిబ్బంది 10 మందిని కాపాడారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో 10 మంది స్పృహ తప్పి అక్కడే పడిపోయారు. MORE NEWS..