INDIA NEWS: చైనాకు చెందిన హెచ్.క్యూ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాక్... భారత్ సరిహద్దు రాష్ట్రాల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడికి యత్నించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న భారత సైన్యం సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టికరిపించింది. అయితే... పాకిస్థాన్ లోని సైనిక స్థావరాలపై కానీ, పౌర నివాసాలపై కానీ భారత్ ఎలాంటి దాడులకు పాల్పడలేదు. పక్కాగా ప్లాన్ చేసి ఉగ్రవాదులనే టార్గెట్ చేసింది.
ఉగ్రవాదులంటే పాక్ సైన్యంలో ఒక భాగం అయిన వేళ.. వారి మరణాలను.. అమరవీరుల మరణాలని, వాటికి ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించింది ఆ దేశం. అన్నట్లుగానే భారత్ లోని సుమారు 15 నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్లు, క్షిపణులతో దాడికి యత్నించింది. అయితే.. ఈ ప్రయత్నాన్ని భారత్ సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టింది.
ఎప్పుడైతే ఉగ్రవాదులపై దాడులకు ప్రతిగా భారత సైనిక స్థావరాలను పాక్ లక్ష్యంగా చేసుకుందో.. భారత్ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ లోని ఆయా కీలక ప్రాంతాల్లో మొహరించిన గగనగల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. 7 ప్రాంతాల్లో వారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసింది.
చైనాకు చెందిన హెచ్.క్యూ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాక్... భారత్ సరిహద్దు రాష్ట్రాల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడికి యత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ యూఏఎస్ గ్రిడ్, ఎస్-400 వ్యవస్థలతో సమర్ధంగా అడ్డుకుంది. అనంతరం భారత్ ప్రతీకార దాడులకు దిగింది.
పాక్ లోని వివిధ కీలక ప్రాంతాల్లోని గగనతల రక్షణ రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం అయినట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు పాక్ గగనతల రక్షణ బలహీనపడిందని.. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దే ఆలస్యం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో లాహోర్ తో పాటు చక్వాల్, సియాల్ కోట్, గుజరన్ వాలా, నరోవాల్, బహవల్పూర్, షెకూపురా.. ఇలా మొత్తం 7 ప్రాంతాల్లోని పాకిస్థాన్ గగనతల వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసిందని తెలుస్తుంది.
గురువారం ఉదయం పాక్ లో లాహోర్ విమానాశ్రయానికి సమీపంలో పెద్ద పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. అనంతరం సైరన్లు మోగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విమానాశ్రయం సమీపంలోని లోని గోపాల్ నగర, నసీరాబాద్ ప్రాంతాల్లో పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని స్థానిక మీడియా నివేదికలు తెలిపిన సంగతి తెలిసిందే.