రాజవొమ్మంగి లో ఎన్ హెచ్ ఆర్ పి ఎఫ్ జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సేవలు


మండల ప్రెసిడెంట్ లింగేటి గౌరీ శివలక్ష్మి వర్కింగ్ ప్రెసిడెంట్ మైలబోయిన రమణి ల అధ్యక్షతన

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం: నియోజకవర్గంలోని రాజవొమ్మంగి మండలం రాజవొమ్మంగి గ్రామంలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం మరియు మండల సమావేశం నిర్వహించారు. BY: BCN TV NEWS ఈ కార్యక్రమానికి ఎన్ హెచ్ ఆర్ పి ఫారం మండల ప్రెసిడెంట్ లింగేటి గౌరీ శివలక్ష్మి వర్కింగ్ ప్రెసిడెంట్ మైలబోయిన రమణి, సెక్రటరీ సురేష్ కుమార్ ఇలా అధ్యక్షతన వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ హెచ్ ఆర్ పి ఫారం రాష్ట్ర ఇంచార్జ్ వలీ ఖాన్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాంప్రసాద్ మహిళా విభాగం ఇంచార్జ్ శ్రీదేవి హాజరయ్యారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ హెచ్ ఆర్ పి ఫారం కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో పున్నపు చిన్నతమ్మారావు మాస్టారు ఆర్థిక సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు బ్రెడ్స్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం స్థానిక మండల ప్రెసిడెంట్ లింగేటి గౌరీ శివలక్ష్మి నివాసం వద్ద సమావేశం నిర్వహించారు. 

రాష్ట్ర ఇంచార్జ్ వలీ ఖాన్ మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఎవరు ఏ విధంగా స్పందించాలి హక్కుల రక్షణకై అందరూ కృషి చేయాలని ఎవరికైనా హక్కుల భంగం కలిగినప్పుడు బాధితులు మన సంస్థను ఆశ్రయించిన వారికి తగు న్యాయం జరిగే వరకూ ఎన్ హెచ్ ఆర్ పి ఫారం కుటుంబ సభ్యులంతా పోరాడాలని పిలుపునిచ్చారు. 

నియోజకవర్గ ఇన్చార్జ్ రాంప్రసాద్ మాట్లాడుతూ హక్కుల గురించి వివరించి హక్కులకు భంగం కలిగినప్పుడు ఏ విధమైన చర్యలు ఎలా తీసుకోవాలి మనం ఎలా పోరాడాలి అన్న విషయాలను తమ సలహాలు సూచనలను తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ పి ఫారం బోర్డు బోర్డు మెంబర్ ప్రభాకర్, స్థానిక మండల వైస్ ప్రెసిడెంట్ జగన్నాథ స్వామి దొర, సెక్రటరీ సురేష్ కుమార్, మహిళా విభాగం సెక్రటరీ పాతర పద్మావతి, కమిటీ మెంబర్స్ యుగంధర్ వెంకట సాయి డి. నాగేంద్ర, డి. సూర్యనారాయణ, బి. రామకృష్ణ, అడ్డతీగల మండల ప్రెసిడెంట్ వెంకటరమణ, వైస్ ప్రెసిడెంట్ ఎస్ కే బి నవాజ్, కమిటీ సభ్యులు పార్వతి, జనరల్ సెక్రటరీ గోపి వీరరాఘవ తదితరులు పాల్గొన్నారు.