దేశం మొత్తానికి చెబుతున్నా.. లోకేష్ ను చూసి నేర్చుకోండి


విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీని ఆకర్షించిందని చెబుతున్నారు. దాదాపు 3 లక్షల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ రికార్డ్సులోకి ఎక్కడంపై ప్రధాని మోడీ కూడా అభినందించారు

VISAKHAPTNAM:విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీని ఆకర్షించిందని చెబుతున్నారు. దాదాపు 3 లక్షల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ రికార్డ్సులోకి ఎక్కడంపై ప్రధాని మోడీ కూడా అభినందించారు. యోగాంధ్ర విజయవంతం కావడానికి యువనేత, రాష్ట్ర ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ చేసిన కృషిని అభినందిస్తున్నట్లు చెప్పారు. సభా వేదికపై నుంచి లోకేష్ ను అభినందించిన ప్రధాని మోదీ, యువనేతను చూసి దేశంలో మిగిలిన వారంతా కష్టపడటం నేర్చుకోవాలని సూచించారు.

యోగాంధ్ర విజయవంతం కావడం వెనుక రాష్ట్ర మంత్రి లోకేశ్ తీవ్రంగా కష్టపడ్డారని ప్రధాని మోదీ ప్రశంసించారు. దాదాపు నెల రోజులుగా ఆయన చేసి కృషి ఫలితమే విశాఖలో యోగాంధ్ర సక్సెస్ అయిందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడానికి లోకేశ్ చేసిన ప్రయత్నాలను ప్రధాని మోడీ కొనియాడారు. కార్యక్రమం విజయవంతం చేయడానికి లోకేశ్ పనిచేశారని ప్రధాని చెప్పారు. లోకేశ్ పనిచేసిన విధానాన్ని దేశంలో ప్రతి ఒక్కరూ నమూనాగా చేసుకుని పాటించాలని పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ ప్రశంసలతో మంత్రి నారా లోకేశ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో పెట్టుబడుల సాధనలో తనదైన ముద్ర వేస్తున్న లోకేశ్ తన పనితీరుతో జాతీయ నేతలను ఆకట్టుకుంటున్నారని అంటున్నారు. ఒక్క యోగాంధ్రే కాకుండా, ఐటీ పాలసీలు, రాష్ట్ర సమస్యలపై పలుమార్లు ఢిల్లీ వెళుతూ కేంద్ర మంత్రులను కలుస్తున్న లోకేశ్ తన సమర్థతను చాటుకున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో ప్రధాని మోదీతో సుమారు రెండు గంటల పాటు చర్చించారు లోకేశ్. నాటి విశేషాలను ఒక్క రోజు ముందుగా వెల్లడించిన లోకేశ్.. విశాఖలో ప్రధానితో అభినందనలు అందుకోవడం విశేషంగా చెబుతున్నారు.

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now