ఘనంగా కళా వెంకట్రావు గారి 125 వ జయంతి వేడుకలు


ANDHRAPRADESH:ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు

ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర మాజీ రెవెన్యూ శాఖ మంత్రి స్వర్గీయ కళా వెంకట్రావు 125వ జయంతి వేడుకలను వారి కుటుంబ సభ్యులు రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు . 

రావులపాలెం జాతీయ రహదారి సమీపంలో గల కళా వెంకట్రావు కాంస్య విగ్రహానికి  పాలాభిషేకం నిర్వహించి గజమాలతో అలంకరించి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . 

ఈ సందర్భంగా కళా వెంకట్రావు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి స్వర్గీయ కళా వెంకట్రావు జయంతి వేడుకల్లో వారి కుటుంబ సభ్యులు మనవళ్ళు, మునిమనవళ్ళు కూడా పాల్గొనడం చాలా అభినందనీయమని అన్నారు వారి మునిమనవడు కళా వెంకట్రావును దుస్సాలతో సత్కరించారు. 

ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ కళా వెంకట్రావు కోనసీమ,రావులపాలెం ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని నేడు కోనసీమ ముఖద్వారంగా ఖ్యాతిగాంచిన రావులపాలెం మీదుగా జాతీయ రహదారి వెళ్లడానికి అప్పటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వ పెద్దలతో సంప్రదించి ఎనలేని కృషి చేశారని ఆయన ముందుచూపు వల్లే కోనసీమ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు నాడు రావులపాలెం సెంటర్లో జాతీయ రహదారిపై స్వర్గీయ కళా వెంకట్రావు విగ్రహం ఏర్పాటు చేయడానికి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమ సుందర్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అనుమతులు సాధించి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.

సందర్భంగా కళా వెంకట్రావు ముని మనవడు కళా వెంకట్రావు మాట్లాడుతూ తమ తాతగారు కోనసీమ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా పేరు ప్రఖ్యాతలు గడించడం తనకు కుటుంబ సభ్యులకు ఎంతో గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం జడ్పిటిసి కుడిపూడి శ్రీనివాసరావు ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, సీనియర్ లాయర్ వేణు,సఖినేటివాకుల రాజు వెలగల సత్తిరెడ్డి కొట్టు సత్యనారాయణ బొక్క శ్రీనివాస్ పాల్గొన్నారు.
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now