ANDHRAPRADESH:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో :కొత్తపేట నియోజక వర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా రావులపాలెం కాపుల కళ్యాణ మండపంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి గారు, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు సిరివరపు శ్రీనివాసరావు గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రైతులకు సన్మాన కార్యక్రమం చేపట్టి పూలమాలలు వేసి రైతులచే వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కేక్ కట్ చేయించారు అనంతరం రైతులకు, వృద్ధులకు దుస్సాలు వాళ్ళతో సన్మానం చేసి పళ్ళు పంపిణీ కార్యక్రమాలు చేశారు.
ఈ కార్యక్రమంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నియోజకవర్గ పార్టీ విస్కృత స్థాయి సమావేశం నిర్వహించారు.
రైతు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షల 64 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయిలుగాను
సుమారు వెయ్య 50 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిఉందన్నారు .
సోషల్ మీడియాలో పోస్టులు గాని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కొన్ని విధి విధానాలు ప్రకటించారు
ఎవరు పడితే వారిని
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం కేసులు పెడతామని విధంగా జైల్లో పెడతామంటే కుదరదు ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు
ఈ సంవత్సర కాలంలో బూటకపు హామీలు ఇచ్చి గద్దెనిక్కారో కనీస కార్యక్రమాలు చేపట్టకుండా కక్ష సాధింపు చర్యలు చేస్తూ పరిపాలన సాగిస్తున్నారు
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన పార్టీ పరిశీలకు రాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కోనసీమలో ఏ జెండా అయితే రెపరెపలాడుతుందో అదే జెండా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi