ANDHRAPRADESH:డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో: కొత్తపేట మండలం పలివెల గ్రామంలో వైసీపీ హయాంలో గ్రామాల్లో సైతం అశాంతి నెలకొని ఉండేదని, రాష్ట్రమంతా ఒక భయానక వాతావరణం వ్యాపించి ఉండేదని కూటమి అధికారంలోకి వచ్చాక ప్రశాంతత నెలకొందని, రాష్ట్ర అభివృద్ధికి భరోసా లభించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట మండలం పలివెల గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలివెల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే బండారు వద్ద కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తి అర్థం చేశారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi