HYDERABAD:విద్యార్థులకు గుడ్ న్యూస్. జులై నెల ముగిసినట్లే. ఇక ఆగస్టులో వరుస సెలవులు ఉండనున్నాయి. వరుసగీ వారం రోజులపాటు సెలవులు రానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 వ తేదీలోపే స్కూల్స్ కు వరుసగా సెలవులు ఉండనున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు మాత్రమే కాకుండా ఉద్యోగులకు కూడా ఆగస్టు నెలలో వరుస సెలవులు వస్తున్నాయి. ఈ నెలలో పండగలు, ప్రత్యేక రోజులు అధికంగా ఉన్న నేపథ్యంలో సెలవులు వస్తున్నాయి. అయితే రోజూ చదువులోపడి తలమునకలు అవుతున్న స్టూడెంట్స్ బిగ్ రిలీఫ్ లభించనుంది. ఆ సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆగస్టు మొదటి వారం నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 3న ఆదివారం.. ఆ రోజు సాధారణంగా సెలవు ఉంటుంది. మరో నాలుగు రోజులు గడిచాక.. ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం ఉంది. ఆ రోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆప్షనల్ హాలిడే ఇచ్చాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కావాలంటే వరలక్ష్మి వ్రతం రోజున వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చు. ఆగస్టు 9న రెండో శనివారం, రాఖీ పండగ వచ్చాయి. ఈ రోజు కూడా సెలవే ఉంటుంది. ప్రతి నెలలో రెండో శనివారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఆగస్టు 10 ఆదివారం దేశ వ్యాప్తంగా సాధారణంగా సెలవు ఉంటుంది. ఇలా ఆగస్టు 8, 9, 10వ తేదీల్లో మూడు రోజుల పాటు వరుస సెలవులు ఉండనున్నాయి.
ఆ తర్వాత ఆగస్టు 11 నుంచి 14 పాఠశాలలు ఉన్నా తరగతులు ఉండవని తెలుస్తోంది. ఎందుకంటే ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం ఉంది. దీంతో నాలుగైదు రోజుల నుంచే ప్రతి పాఠశాలలో గేమ్స్ , హడావిడి, క్లాస్ రూమ్స్ అలంకరణ అన్నీ ఉంటాయి. దీంతో ఆ నాలుగు రోజులపాటు పెద్దగా క్లాసులు ఉండవు. సరదాగా గడచిపోతాయి. ఈ లెక్కన చూసుకుంటే ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు దాదాపు వారం రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రానున్నాయి.

Shakir Babji Shaik
Editor | Amaravathi