వందే భారత్ రైళ్ళపై తెలంగాణాకు మరో బంపర్ న్యూస్!


HYDERABAD:తెలంగాణ రాష్ట్రానికి రైల్వేశాఖ మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో మరో పట్టణానికి వందే భారత్ ట్రైన్ ను కానుకగా ఇవ్వనుంది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభ వేదికగా కీలక ప్రకటన చేయడం తెలంగాణ రాష్ట్రానికి మరో శుభవార్తగా చెప్పవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న రైల్వేశాఖ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

వందే భారత్ రైలుపై లేటెస్ట్ అప్డేట్

మంచిర్యాల నుండి వందే భారత్ రైలు నుండి నడపడానికి సమాలోచనలు జరుపుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలంగాణలోని మంచిర్యాలలో ప్రారంభమైతే ఇది రాష్ట్రంలో రైలు ప్రయాణానికి ఒక కొత్త రూపాన్ని తెస్తుంది. ఈ రైలు ప్రయాణికులకు తక్కువ సమయంలో ప్రయాణం చేసే అవకాశాన్ని ఇస్తుంది. తద్వారా ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభం అవుతాయి.

లోక్సభలో రైల్వే మంత్రి ప్రకటన

ఈ వందే భారత్ రైలు గురించి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు లోక్సభలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం చెప్పారు. మంచిర్యాల నుండి వందే భారత్ రైలు ను నడపడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగ్గి నిర్ణయం తీసుకుంటామని ఆయన లోక్సభలో వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటనతో మంచిర్యాల వాసులలో కొత్త ఆశలు చిగురించాయి.

తెలంగాణాలో నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు

సహజంగా వందే భారత్ రైళ్లు ప్రయాణికుల యొక్క ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తున్నాయి. ప్రయాణికులకు సుఖవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు నడుస్తున్నాయి. ఈ రైలు దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతున్నాయి.

మంచిర్యాలకు వందే భారత్ రైలు

సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ నాగపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ నాలుగు రైళ్లు ప్రధానమైన పట్టణాలను కలుపుతూ ప్రయాణికుల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరుస్తున్నాయి. ఇక మంచిర్యాలకు కూడా వందే భారత్ రైలు వస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు ప్రయాణం మరింత సులభం అవుతుందని భావిస్తున్నారు.

మంచిర్యాలకు వందే భారత్ పై స్థానికుల్లో ఆశలు

మరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి ప్రకటించినట్లు సాధ్యాసాధ్యాలు పరిశీలించి త్వరితగతి మంచిర్యాలకు వందే భారత్ అందించాలని స్థానికులు భావిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణ రవాణా రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు. రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి రైళ్లు అందుబాటులోకి వస్తే, అవి భారతదేశంలో ప్రయాణ భవిష్యత్తును మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వందేభారత్ రైళ్లు తెలియజేస్తున్నాయి.


WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now