ANDHRAPRADESH:రావులపాలెంలో స్పెషల్ డ్రైవ్: గంజాయి, గుట్కా విక్రయాలపై కఠిన చర్యలు.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెం మండల కేంద్రంలో, రావులపాలెం టౌన్ సీఐ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎదురుగా ఉన్న వెంకటలక్ష్మి బేకరీ & కేఫే లో తనిఖీలు నిర్వహించిన సమయంలో, అక్కడ సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, గుట్కా ప్యాకెట్లు నిల్వ చేసినట్లు గుర్తించారు. అలాగే, కొన్ని బన్ ప్యాకెట్లపై గడువు తారీఖీలు ముగిసినట్టు అధికారులు గుర్తించారు.
ఈ సందర్భంగా సీఐ శేఖర్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే పరిసరాలలో గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాల విక్రయాలు జరిగితే, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో రావులపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi