అంగరంగ వైభవంగా జరిగిన జిల్లా యుపిఎఫ్ మూడవ ఆవిర్భావ దినోత్సవం


ANDHRPRADESH:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మూడవ ఆవిర్భావ దినోత్సవం ఉప్పలగుప్తం గ్రామం ఇస్సాకు ఫౌండేషన్ ప్రార్థన శక్తి ఎస్టేట్ పాస్టర్ చిక్కం దానియేలు ఆధ్వర్యంలో, జిల్లా యుపిఎఫ్ సెక్రటరీ పాస్టర్ యెహోషువ అధ్యక్షతన జరిగింది.

జిల్లా అధ్యక్షులు రెవ. కార్ల్ డేవిడ్ కొమనాపల్లి మూడు సంవత్సరాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయుటకు దేవుడు ఎంతగానో కృప చూపారని, రెండవసారి ఏకగ్రీవంగా మరల జిల్లా కమిటీని ఎన్నుకున్నందుకు జిల్లా పాస్టర్స్ అందరికీ సెక్రటరీ యెహోషువ ధన్యవాదములు తెలిపారు. మనమంతా ఇలానే ఐక్యతతో కలిగి ఉండాలని, రాబోయే రోజుల్లో మన జిల్లా ఫెలోషిప్ ను మరింతగా బలపరచుకొని రాష్ట్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు.

వాక్య సందేశం అందించిన రెవ. చిక్కం ఇస్సాకు వాక్యం అందించి సేవకులకు ఎటువంటి కష్టం వచ్చినా నన్ను సంప్రదించాలని నా వంతుగా నీకు ఎప్పుడు సహకరిస్తానని, మనమంతా దేవునిలో దేవుని సేవలో పనిచేస్తున్న సోదరులమని, సేవ పరిచర్య మీ ప్రాంతాల్లో బహుగా వెదజల్లుతూ దేవుని పనిలో బహుబలంగా వాడబడాలని కోరారు. 

ముఖ్య అతిథిగా విచ్చేసిన బిషప్ సామ్యూల్ పిన్ని శుభములు తెలుపుతూ మనమంతా ఒకే సహవాసం కలిగి దేవుని పరిచర్యలో పాలు భాగస్తులు కావాలని తెలియజేశారు. 

జిల్లా ఉపాధ్యక్షులు విక్టర్ నందా, ఎర్నెస్ తాతపూడి, యు.వి భాస్కరరావు, ట్రెజరర్ ఇమ్మానియేల్, జాయింట్ సెక్రెటరీఅబ్రహం పిన్ని ఫెలోషిప్ రిపోర్ట్ అందజేశారు. 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ బ్రదర్ సునీల్ కుమార్ చర్చ్ పర్మిషన్ కొరకు క్రైస్తవ రాయితీలు కొరకు తెలియజేయగా, బీహార్ మిషనరీ సేవలు కొరకు బ్రదర్ సంపత్ గారు వివరించగా స్థానిక దైవజనులు చిక్కం డానియల్ చక్కటి విందు, బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి 18 మండలాలు కమిటీలు, ఆరు జోన్లు, జిల్లా నాయకులు, విప్పర్తి రాజకుమార్ పోతుల జయరాజు, జాన్ పాల్, సత్య ప్రసాద్, హోసన్నా, బాలు వెస్లీ, రీఛర్డ్ సామ్యూల్, 300కు పైగా దైవజనులు పాల్గొన్నారు. 

జిల్లా ప్రెసిడెంట్ కార్ల్ డేవిడ్ కొమానపల్లి క్రిస్మస్ డిసెంబర్ ఒకటో తేదీన అందరూ సిద్ధపడండి అని తెలియజేసి ఆశీర్వాద ప్రార్థనలతో ముగించారు.

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now