ANDHRPRADESH:పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు..డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట లో పేద ప్రజల కళ్ళల్లో ఆనందం, వారి అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు.
శుక్రవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒక్క కొత్తపేట నియోజకవర్గంలోనే 42,522మందికి సామాజిక, ఆర్థిక భద్రత కోసం పింఛన్లు అందిస్తున్నామని ఆయన అన్నారు.
నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఆలమూరు మండలంలో మొత్తం 10,845 పించన్లకు గాను రూ. 4,79,73000లు, ఆత్రేయపురం మండలంలో 9578 పింఛన్లకు గాను రూ.4,02,90,000లు, కొత్తపేట మండలంలో 10,329 పింఛన్లకు గాను రూ.4,54,12,500లు రావులపాలెం మండలంలో 11,770 పింఛన్లకు గాను రూ. 5,10,86,500లు మొత్తం నియోజకవర్గానికి సంబంధించి రూ.
18.47 కోట్ల రూపాయలు (18,47,62000) పంపిణీ జరుగుతుందన్నారు. ఈ నెల నూతనంగా కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం 763 స్పౌజు పింఛన్లను అందించడం జరుగుతుందని తెలిపారు. ఠంచనుగా పింఛన్ అందిస్తూ పేదల జీవితాలకు భద్రత కల్పిస్తున్నామని వ్యాఖ్యానించారు.