నిజామాబాద్ జిల్లా: డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామంలోని జెడ్పీహెచ్ పాఠశాల ప్రాంగణంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. దిలీప్ కుమార్ అధ్యక్షత వహించి, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు పాఠశాలల అభివృద్ధికి కూడా సహకరించాలని ఆయన కోరారు.
ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల ప్రవళిక, ఉప సర్పంచ్ పి. సురేష్‌తో పాటు వార్డు మెంబర్లు, పాఠశాల బృంద సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
