కాకినాడ జిల్లా జగ్గంపేట: స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, రైతులకు వర్షాకాలం మొదలై నారుమడి వేసుకునే సమయం వచ్చిందని కానీ నీరు సమృద్ధిగా అందక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తాళ్లూరు లిఫ్ట్ ద్వారా నీరు విడుదల చేయాలని అన్నారు. లిఫ్టు మూడు పంపులు పాడైపోయి నిరుపయోగంగా ఉందని మొన్న బస్సు యాత్రలో పరిశీలించిన తమకు ఈ సమస్య తెలుసుకుందామని పంపులకు గ్రీజు పెట్టలేని స్థితిలో నిధులు లేవని కాంట్రాక్టర్లు కూడా నష్టపోయి తాళ్లూరు లిఫ్ట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాప్ ద్వారా ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని కలెక్టర్ ద్వారా కనీసం 30 లక్షల రూపాయలైనా సి ఎస్ ఆర్ నిధులు విడుదల చేసి లిఫ్ట్ కు మరమ్మత్తులు చేయాలని లేనిపక్షంలో వారం రోజులు వేసి చూచి రైతులతో కలిసి కాకినాడ కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజవర్గ టిడిపి పరిశీలకులు శీలం వెంకటేశ్వరరావు, కోర్పు లచ్చయ్య దొర, మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, జంపన సీతారామచంద్ర వర్మ, పాలకుర్తి ఆదినారాయణ, పాలచర్ల సత్యనారాయణ, యర్రంశెట్టి బాబ్జి, శీలా మంతుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.