టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్- 3 పోస్టులకు దరఖాస్తులు



ఏలూరు: ఏలూరు జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయములో ఒక సంవత్సరము తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదికన పనిచేయు నిమిత్తం ఐదు (5) టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్- 3 పోస్టులకు 137 మంది అభ్యర్దులు దరఖాస్తు చేసుకోనగా, ది.23.02.2024 తేదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల మేనేజర్ వారి కార్యాలయము, ఏలూరు నందు వారి విద్యార్హతల ఒరిజినల్ ధ్రువపత్రములు పరిశీలనకు 123 మంది అభ్యర్దులు హాజరైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి తెలిపారు. 


కావున, హాజరైన అభ్యర్దుల యొక్క ధృవీకరణ పత్రములు వారి విద్యా అర్హత ఆధారంగా నియామక నిబoదనల ప్రకారం అంతిమ పరిశీలన అనంతరం, మెరిట్ మరియు రోస్టర్ పాయింట్స్ అనుసరించి వారి ఎంపిక వివరములు ఏలూరు జిల్లా అధికారిక వెబ్ సైట్ అయిన https:// eluru.ap.gov.in / notice_category / recruitment/ నందు ప్రచురించట ద్వారా గాని లేదా ఎంపిక అయిన అభ్యర్దుల వ్యక్తిగత ఫోన్ లకు సమాచారం తెలియచేయుబడునన్నారు.